మరో తమిళ రీమేక్ కు అల్లరి నరేష్ గ్రీన్ సిగ్నల్ ?

By Srikanya

హైదరాబాద్ : తమళ పదం చిత్రం తెలుగు రీమేక్ సుడిగాడు ఘన విజయం సాధించటం తో ఇప్పుడు అల్లరి నరేష్ దృష్టి మొత్తం తమిళ రీమేక్ లపై పడింది. తాజాగా ఆయన Naduvala Konjam Pakkatha Kaanom అనే తమిళ చిత్రం చూసి చాలా బాగా నచ్చిందని,ఆ చిత్రం తెలుగులో చేయటానికి సిద్దమే అని తన నిర్మాతలకు చెప్పటం జరిగిందని సమాచారం. షార్ట్ టైమ్ మెమరీని ఆధారం చేసుకుని వచ్చిన ఈ చిత్రం ఓ కామెడీ. బాలాజీ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. విజయ్ సేతపతి హీరోగా చేసారు.

Naduvula Konjam Pakkatha Kaanom అంటే తెలుగులో మధ్యలో కొన్ని పేజీలు మిస్సయ్యాయి అని అర్దం. ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ ప్రేమ కుమార్ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. కథ ప్రకారం..హీరో తను ప్రేమించి అమ్మాయితో వివాహానికి సిద్దపడాతాడు. అయితే వివాహానికి ముందు రోజు క్రికెట్ ఆడుతూంటే...అనుకోకుండా తలకు బాల్ వచ్చి తగులుతుంది. దెబ్బ పెద్ద సీరియస్ కాకపోయినా మరో సమస్య తెచ్చిపెడుతుంది. అతని జీవితంలో కొన్ని రోజులు మరిచిపోతాడు. అతనికి కాలేజీ రోజులు, అంతకు ముందు చిన్నప్పటి రోజులు అన్ని గుర్తు ఉంటాయి కానీ... పెళ్లి విషయం అస్సలు గుర్తు ఉండదు.

దాంతో భయపడ్డ అతని స్నేహితులు అతన్ని డాక్టర్ దగ్గరకి తీసుకు వెళ్తారు. అన్ని రకాలుగా పరీక్షించిన డాక్టర్ ...ఏ క్షణమైనా తిరిగి అతని మెమెరీ అతనికి వచ్చే అవకాసం ఉందని, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తాడు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేయటంతో స్నేహితులంతా ఈ విషయం దాచి పెట్టి ఓ డ్రామా ఆడి పెళ్లిని నిర్విఘ్నంగా జరిగేలా చేస్తారు. హీరో తల్లి తండ్రుల నుంచి, అతని ప్రేయసి, పెళ్లికూతురు అయిన అమ్మాయి నుంచి దాచి పెట్టే క్రమంలో జరిగే సంఘటనలు హిలేరియస్ గా నవ్విస్తాయి.

ఇక ప్రస్తుతం అల్లరి నరేష్..యముడు మొగుడు చిత్రంతో రెడీ అవుతున్నాడు. యమలోకం బ్యాక్ డ్రాప్ లో జరిగే కథతో గ్యారెంటీగా మరో హిట్ కొడదాననే నమ్మంకంగా ఉన్నాడు నరేష్. ఇక ఈ రీమేక్ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారు..ఎవరు డైరక్ట్ చేయనున్నారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X