రెమ్యునరేషన్ పెంచేసిన అల్లరి నరేష్..ఎంతంటే

By Srikanya

హైదరాబాద్ : సుడిగాడు చిత్రం భాక్సాఫీస్ వద్ద పన్నెండు నుంచి పనిహేను కోట్లు వరకూ కలెక్టు చేసే అవకాసం ఉందని ట్రేడ్ లో వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లరి నరేష్ తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సడన్ స్టార్ సడెన్ గా పారితోషికం పెంచేసి తన నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఇంతవరకూ కోటిన్నర రెమ్యునేషన్ తీసుకునే నరేష్ కోటి రూపాయలు పెంచినట్లు సమాచారం. రెండున్నర కోట్లు రెమ్యునేషన్ ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేగాక ఈ చిత్రంతో అల్లరి నరేష్ చేసే సినిమాల బడ్జెట్ కూడా పెరగనుంది. ఇప్పటికే అల్లరి నరేష్ తాజా చిత్రం ఈ క్రేజ్ తో పన్నెండు కోట్లు బిజినెస్ చేసింది

ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. అవి యముడికి మొగుడు,యాక్షన్ 3డి,కెవ్వు కేక చిత్రాలు. యముడికి మొగుడు చిత్రానికి వస్తే..అల్లరి నరేష్, రీచా పనయ్ జంటగా ఇ. సత్తిబాబు దర్శకత్వంలో ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై చంటి అడ్డాల నిర్మిస్తున్న భారీ వినోదాత్మక చిత్రం 'యముడికి మొగుడు'. తను ఇంత వరకూ పోషించని ఓ కొత్త గెటప్‌తో నరేష్ పాల్గొంటున్న ఓ పాట కోసం ఓ ఆడిటోరియం సెట్‌ను భారీ స్థాయిలో నిర్మించారు. చిత్రం పోగ్రెస్ గురించి నిర్మాత చంటి అడ్డాల మాట్లాడుతూ.. ఈ నెలలోనే ఆడియోను, విజయదశమికి సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు.

'యముడికి మొగుడు' అనే టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, నరేష్ కెరీర్లోనే భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం పూర్తి వినోదభరితంగా ఉంటుందని ఆయన అన్నారు. దర్శకుడు సత్తిబాబు మాట్లాడుతూ 'మా కథకు తగిన టైటిల్ యముడికి మొగుడు. హీరో, యముడు పాత్రల మధ్య చిత్రీకరించిన సన్నివేశాలు చాలా కొత్తగా ఉండటమే కాకుండా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తాయి. అలాగే 'అల్లుడా..మజాకా' చిత్రంలోని 'అత్తో..అత్తమ్మ కూతురో' పాటను రీమిక్స్ చేసి నరేష్, రమ్యకృష్ణ, రీచా పనయ్‌పై చిత్రీకరించారం. ఇది సినిమాకి హైలెట్ అవుతుంది. అలాగే యముడికి కొడుకుగా భరత్ పాల్గొన్న సన్నివేశాలు కూడా కడుపుబ్బా నవ్విస్తాయి' అని తెలిపారు.

యాక్షన్ చిత్రం విషయానికి వస్తే...అల్లరి నరేష్, వైభవ్, రాజసుందరం, కిక్‌శ్యామ్ ప్రధాన పాత్రదారులుగా ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'యాక్షన్' 3డి. అనిల్ సుంకర దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు అనిల్‌ సుంకర మాట్లాడుతూ, 'ఓ చక్కటి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. చిత్రం బాగా వస్తున్నదంటే అందుకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల సహకారం ఎంతగానో ఉంది. సర్వేష్‌ మురారి ఛాయాగ్రహణం కనువిందు చేస్తుంది' అని చెప్పారు. కెవ్వు కేక చిత్రాన్ని బ్లేడు బాబ్జీ దర్శకుడు దేవి దర్శకత్వంలో రూపొందనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X