నిజంగానే మహా సుడిగాడు: అల్లరి నరేష్
ఉషా కిరణ్ మూవీస్ సంస్థ నిర్మించిన 84వ సినిమా బెట్టింగ్ బంగార్రాజు. అల్లరి నరేష్ హీరోగా ఇ సత్తిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో బంగార్రాజు మహా సుడిగాడని ఆ గ్రామంలో పెద్ద పేరు. ఎందుకంటే పదోతరగతి పది సార్లు తప్పినా జనాన్ని జనాన్ని మాత్రం తన పందేలతో ఓడించటం మాత్రం తప్పుడు బంగార్రాజు.
తనను చూసి పారిపోతున్న వారిచేత కూడా పందెం కాయించి వారిని ఏదో ఒక రకంగా ఓడిస్తాడని అందువల్ల వీడు మహాసుడిగాడు అంటూంటారు. ఆ గ్రామస్థులు. నిజంగానే ఈ సినిమాలోని బంగార్రాజు క్యారెక్టర్ లానే అల్లరి నరేష్ మహా సుడిగాడు. లేకపోతే ఆయన పర్సనాలిటీకి ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సినిమాల్లో నిలదొక్కుకోవటం కష్టం. ఒకరిదాకా ఎందుకు తన సోదరుడు ఆర్యన్ రాజేష్ కి నరేష్ కన్నా మంచి ఫీచర్స్ ఉన్నా ఆయన హిట్ కి నోచుకోక పోవటం నరేష్ మాత్రం గ్యారంటీ హీరోగా వరుస విజయాలు సాదించటం చూస్తే నిజంగానే అల్లరి నరేష్ సుడిగాడు అనుకోవచ్చు కదా?


Click it and Unblock the Notifications











