ఏఎన్‌ఆర్ క్లాప్‍తో అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’
ఈ మధ్య కాలంలో సినిమాల్లో బాగా క్రేజ్ వచ్చిన పేర్లను మరియు బాగా హిట్ అయిన పాటలోని మొదటి పదాలను తీసుకొని సినిమా టైటిల్స్ గా పెట్టి తమ సినిమాలకు క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అదే తరహాలో కామెడి హీరో 'అల్లరి' నరేష్ తదుపరి చిత్రానికి 'కెవ్వు కేక' అనే టైటిల్ ని ఖరారు చేశారు.
అల్లరి నరేష్ హీరోగా దేవి ప్రసాద్ దర్శకత్వం లో రూపొందబోయే 'కెవ్వు కేక' చిత్ర షూటింగ్ ప్రారంభం ఈ రోజు రామానాయుడు స్టూడియో లోజరిగింది. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అక్కినేని నాగేశ్వరరావు క్లాప్ నివ్వగా , కె.ఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దేవి ప్రసాద్ దర్శకత్వంలో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు.
దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ....కెవ్వు కేక ఒక కామెడి క్లబ్ లా ఉంటుంది. బ్లేడ్ బాబ్జి హిట్ తో సినిమాలపై భాద్యత పెరిగింది . ఆ సినిమా కన్నా రెండింతలు కామెడి ఈ సినిమాలో ఉంటుంది.టైటిల్ అదిరిందని అందరు అంటున్నారు ప్రేక్షకుల ఆశీస్సులుమాకు కావాలి అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ..సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.
కాగా....అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్ జంటగా తెరకెక్కిన 'సుడిగాడు' చిత్రం ఆగష్టు చివరివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా ప్రస్తుతం నరేష్ 'యాక్షన్' మూవీ మరియు ఒక సోసియో ఫాంటసి చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











