»   » హీరోయిన్‌ను పెళ్లాడిన అల్లరి నరేష్, ఫోటో హల్ చల్!

హీరోయిన్‌ను పెళ్లాడిన అల్లరి నరేష్, ఫోటో హల్ చల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు ఇంట్లో వాళ్లు అల్లరి నరేష్ పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ హీరోయిన్ మెడలో తాళి కట్టిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ ఫోటోను చూసి కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఇది అల్లరి నరేష్ తర్వాతి సినిమాకు సంబంధించిన ఫోటో.

ఉగాది సందర్భంగా అల్లరి నరేష్ తన సోషల్ నోట్వర్కింగ్ పేజీ ద్వారా ఈ ఫోటోను షేర్ చేసాడు. అభిమానులను సర్‌ప్రైజ్ చేయడానికే ఆయన ఈ ఫోటో విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. కొత్త వ్యక్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమా టైటిల్ కూడా ఇంకా ఖరారు కాలేదు. అల్లరి నరేష్ కెరీర్లో ఇది 49వ సినిమా. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Allari Naresh Married to Unknown Heroine?

కెరీర్లో 50 సినిమాలు పూర్తయిన తర్వాతే అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలాగైనా ఈ సంవత్సరమే 50వ సినిమా పూర్తి చేసి పెళ్లి పీటలెక్కబోతున్నాడు అల్లరి నరేష్. కుటుంబ సభ్యులు అతడి కోసం సంబంధాలు చూసే పనిలో తలమునకలై ఉన్నారు. అల్లరి నరేష్ అభిరుచికి తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు. పార్టీలు పబ్బులూ అంటూ తిరిగే మోడ్రన్ అమ్మాయి అవసరం లేదని, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా చక్కబెట్టే సాంప్రదాయ బద్దమైన అమ్మాయి కావాలని అల్లరి నరేష్ కోరుకుంటున్నాడట.

ఈ మేరకు అల్లరి నరేష్ కోరుకుంటున్న లక్షణాలు ఉన్న అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారట. కోస్తాంధ్ర ప్రాంతంలో అల్లరి నరేష్‌కు సరిజోడీగల అమ్మాయి కోసం వెతుకుతున్నారట. అమ్మాయిని చూసే బాధ్యతను నటుడు చలపతిరావుతో పాటు, అల్లరి నరేష్ బంధువైన అమ్మిరాజు అనే వ్యక్తి భుజానేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
Is Actor Allari Naresh already married? Has Naresh tied the knot with an "unknown" heroine? Well, going by the above picture, it says so. But don't get mistaken as the fact is that the still is part of Naresh's upcoming film where makers want to surprise the audience by concealing the heroine's face.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu