అల్లరి నరేష్ సరసన అనుష్క నటిస్తోంది..డిటేల్స్
అల్లరి నరేష్ సరసన తొలిసారిగా అనుష్క హీరోయిన్ చేయనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వీరి కాంబినేషన్‌లో నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మే రెండవ వారంలో ఈ చిత్రం అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం అనుష్క తమిళంలో వేదం రీమేక్ వానమ్ లో నటిస్తోంది. అలాగే నాగార్జున సరసన ఢమురుకం లో కమిటైంది. అల్లరి నరేష్ విషయానికి అతను నటించిన సీమ టపాకాయ చిత్రం త్వరలో విడుదల కానుంది.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి కామిడీగా రూపొందుతోంది.రీసెంట్ గా ఈ చిత్రం అడియో కార్యక్రమం జరిగింది.


Click it and Unblock the Notifications











