twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు' డిటేల్స్

    By Srikanya
    |

    అల్లరి నరేష్ తాజా చిత్రానికి సుడిగాడు అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. తమిళ సూపర్ హిట్ తమిళ పదం రీమేక్ గా రూపొందున్న ఈ చిత్రాన్ని భీమినేని శ్రీనివాస రావు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు సినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన ఈ చిత్రం 2012 వేసవికి విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంతో పాటు అల్లరి నరేష్ ని నెల తక్కువోడు అనే చిత్రం కూడా చేస్తున్నాడు.

    గతంలో అల్లరి నరేష్ తో బెట్టింగ్ బంగార్రాజు చిత్రం డైరక్ట్ చేసిన సత్తిబాబు తాజా చిత్రం టైటిల్ అది. అల్లరి నరేష్ తో చేయబోతున్న ఈ చిత్రాన్ని అడ్డాల చంటి నిర్మిస్తున్నాడు. మార్చి నెలాఖరునుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. ఈ నెల తక్కువ చిత్రం కూడా పూర్తి స్ధాయి కామిడీగా రన్ అవుతుందని చెప్తున్నారు. మరో ప్రక్క అల్లరి నరేష్ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. నారాయణ అనే నూతన దర్శకుడుని పరిచయం చేస్తూ సోలో నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రలోనూ ఆయన చేస్తున్నారు. దీవానా మస్తానా రీమేక్ గా రూపొందుతున్న ఆ చిత్రంలో శర్వానంద్,శ్రియ మరో కీలకపాత్రల్లో కనపించనున్నారు.

    English summary
    A Telugu remake of Tamil movie ‘Tamil Padam’. The film has been tentatively titled as Sudi Gadu in Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X