Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రవితేజతో ముగ్గురు భామల రొమాన్స్.. అల్లరోడు ఎంటరైతే..!
కమెడియన్ కమ్ హీరోగా అల్లరి నరేష్ ఫుల్ సక్సెస్ అయ్యాడు. అంతేకాదు నేటితరం స్టార్ హీరోలను మించి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత కూడా ఈ అల్లరోడిదే. హీరోగా అయినా, హీరో ఫ్రెండ్‌గా అయినా, విలక్షణ రోల్ అయినా, కామెడీ పండించే కుర్రాడిగా అయినా.. ఇలా ఏ పాత్రలోనైనా అల్లరి నరేష్ వెంటనే ఒదిగిపోతాడు. ఆయన గత సినిమాలను నెమరు వేసుకుంటే ఈ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమైపోతుంది. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తెర వెనుక చక్రం తిప్పితే.. కొడుకు అల్లరి నరేష్ వెండితెరపై చక్రం తిప్పుతున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో కాస్త నెమ్మదించిన ఈ అల్లరోడు ఇటీవలే 'మహర్షి' సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కేశాడు.
మహేష్ బాబు స్నేహితుడిగా
మహేష్ 25 వ సినిమా మహర్షితో మహేష్ బాబు కాలేజీ స్నేహితుడిగా అల్లరి నరేష్ అభినయం భేష్ అనిపించుకుంది. పూజా హెగ్డే, అల్లరి నరేష్, మహేష్ బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఆ క్యారెక్టర్ అల్లరోడు తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్లుగా ఒదిగిపోయాడు ఈవీవీ తనయుడు. దీంతో ఆయనకు అలాంటిదే మరో అవకాశం తలుపుతట్టింది.
రవితేజతో అల్లరోడి స్నేహం
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం అల్లరి నరేష్‌ని సంప్రదించారట దర్శకనిర్మాతలు. చిత్రాన్ని మలుపుతిప్పే క్యారెక్టర్ అని చెప్పడంతో అల్లరి నరేష్ కూడా ఓకే అనేశాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గతంలో ఇదే కాంబో
గతంలో రవితేజ, అల్లరి నరేష్ కలిసి ‘శంభో శివ శంభో' సినిమా చేశారు. ఇందులో కూడా వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా నటించారు. ముఖ్యంగా అల్లరి నరేష్ పాత్ర చిత్రానికి ప్రాణం పోసింది. రవితేజ కోసం ఏమైనా చేసే స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటన అందరినీ అబ్బురపరిచింది. దీంతో 'డిస్కో రాజా'లో ఈ కాంబో మరోసారి రిపీట్ అనడం ప్రేక్షకులకు ఆసక్తికర అంశం అయింది.
రవితేజతో ముగ్గురు భామల రొమాన్స్
ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తుండగా.. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.