twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామ్నాపై కన్నేసిన..

    By Staff
    |

    Kamna Jatmalani
    సెక్సీ లుక్స్ తో టక్కున ఆకట్టుకునే కామ్నా జట్మలానీ కెరీర్ ఆశించినంతగా ముందుకు పోవటం లేదు. బి.జయ ప్రేమికులు చిత్రంతో పరిచయమైన ఆమె తాజాగా ఇవివి సత్యనారాయణ చిత్రంలో అడుగుపెట్టింది. తన కొడుకు అల్లరి నరేష్ హీరోగా బెండు అప్పారావు ఆర్.ఎం.పి టైటిల్ తో చేస్తున్న ఈ చిత్రంలో కామ్నా నవ్వులు పండించనుందని సమాచారం. అయితే మొదట ఈ చిత్రం ద్వారా దిశ పాండే అనే హీరోయన్ ని పరిచయం చేద్దామనుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ రెండు రోజుల షూటింగ్ అనంతరం ఆమె ప్లేసులోకి కామ్నా వచ్చి చేరింది. ఈ మార్పుకు కారణం ఈ చిత్ర రామానాయుడు అని టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆయన గతంలో ఆమెకు తన బ్యానర్ లో ఇస్తానని మాట ఇచ్చారని...అది ఈ ప్రాజెక్టుతో నెరవేర్చుకుంటున్నాడని వినపడుతోంది.

    అయితే ఇవివి మాత్రం తనకు నచ్చిన హీరోయిన్ ని కాకుండా మరొకరు అనేసరికి కొంత కినుక వహించిన పెద్ద బ్యానర్..తనకి లైఫ్ ఇచ్చిన(ప్రేమ ఖైదీ)సంస్ద కాబట్టి కానిస్తున్నాడని అంటున్నారు. ఇక ఇవివి ఈ చిత్రాన్ని తన ఫిటింగ్ మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ లో బకాయి పడ్డ దాదాపు రెండు కోట్ల రూపాయిలు బాకీ తీర్చటానికే ఒప్పుకున్నాడని టాక్. మొదట ఈ చిత్రాన్ని బి.జయ డైరక్ట్ చేయాలనే కథ ఓకే చేసుకున్నారు. అయితే ఈ లావా దేవీల్లో మార్పులు జరిగాయి. అందుకే తండ్రి కొడుకులిద్దరూ ఫ్రీగా చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. ఇక ఇవివి..తనదైన మార్కు హాస్యంకి సెక్స్ ని కలగలిపి కామ్నాని పూర్తి స్ధాయిలో ఎక్స్ పోజింగ్ చేస్తాడని అందరూ అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X