దిల్ రాజు నిజంగానే కొన్నారా లేక...

By Srikanya

హైదరాబాద్: ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు...ఏదైనా చిత్రం రైట్స్ తీసుకుంటున్నారంటే ట్రేడ్ లో క్రేజ్ మొదలవుతుంది. అందుకే సినిమా పూర్తయ్యాక ఆయనకు చూపెట్టి, ఓ ఏరియా కొనిపించి, దాన్ని చూపెట్టి మిగతా ఏరియాల బిజినెస్ లు పూర్తి చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేస్తూంటారు. ఎందుకంటే సినిమాలో విషయం ఉంటేనే దిల్ రాజు తీసుకుంటారనే నమ్మకం అందరిలో ఉంది.

ఇప్పుడు అల్లరి నరేష్ 'జంప్‌ జిలానీ' చిత్రం వైజాగ్, నైజాం రైట్స్ ఆయన తీసుకున్నారని అంతటా మీడియాలో హోరెత్తిపోతోంది. అయితే దిల్ రాజు తరుపు నుంచి కానీ, నిర్మాతల తరుపు నుంచి కానీ అఫీషియల్ గా సమాచారం లేదు. దాంతో ఇది కేవలం రూమరా లేక నిజమా అనే సందేహాలు ట్రేడ్ లో కలుగుతున్నాయి. దీనిపై అఫిషియల్ గా ఏదన్నా ప్రెస్ నోట్ లాంటిది వస్తుందా అనే దాని కోసం ఎదురుచూస్తున్నారు.

అల్లరి నరేష్ హీరోగా 'జంప్‌ జిలానీ'.. టైటిల్ తో ఇప్పుడు సినిమా వస్తోంది. ఇందులో అల్లరి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్‌ హీరోయిన్. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. అంబికా రాజా నిర్మాత. అంబికా కృష్ణ సమర్పకులు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అంబికా కృష్ణ సమర్పణలో వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన "కలగలుపు'' చిత్రం ఆధారంగా తెలుగులో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

Allari Naresh's Jump Jilani 's Nizam rights to Dil Raju?

అంబికా కృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ... తమిళంలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతున్న "కలగలుపు'' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఈ సినిమా రీమేక్ హక్కులు కొన్నాము. ఇదే చిత్రాన్ని యూటీవి మలయాళంలో, హిందీ లో రీమేక్ చేస్తోంది. తమిళంలో అంజలి పోషించిన పాత్రకు ఇషా చావ్లాని ఎంపిక చేశాము. తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది అన్నారు. దర్శకుడు ఇ. సత్తి బాబు మాట్లాడుతూ...నరేష్ కెరీర్‌లో ఇది ఓ మంచి చిత్రంగానూ, అతనికి ఓ మంచి పాత్రగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, రఘు బాబు, ఎం.ఎస్.నారాయణ, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, రావు రమేష్, వేణు మాధవ్, సన, హేమ, గీతా సింగ్, ఖయ్యూం తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కథ: సుందర్ సి. మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: సతీష్ వేగేశ్న, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, సంగీతం: విజయ్ ఎంజెర్, ఛాయాగ్రహణం:దాశరథి శివేంద్ర, కళ: కిరణ్ కుమార్, ఎడిటింగ్: గౌతం రాజు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాంబాబు, నిర్మాత: అంబిక రాజా, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X