ఫ్రీ పబ్లిసిటీ కోసమే ఈ తిప్పలు?

By Srikanya

హైదరాబాద్ : పబ్లిసిటీ అంటూ రామ్ గోపాల్ వర్మ సినిమావాళ్లు పబ్లిసిటీ కోసం ఎన్ని ఆలోచనలు చేస్తారో ఓ పాట ద్వారా వినిపించారు. అది నిజమే అనిపిస్తుంది బయిట జరిగే పబ్లిసిటీ స్టంట్ లను చూస్తూంటే. తాజాగా అల్లరి నరేష్ కొత్త చిత్రానికి టైటిల్ పెట్టడంటూ ప్రకటన ఇవ్వటం కూడా పబ్లిసిటీ స్టంటే అంటున్నారు కొందరు సినిమావాళ్లు.

ఇక టైటిల్ దగ్గర నుంచే నవ్వించడం మొదలెడతాడు అల్లరి నరేష్‌. ఆయన నటించే ప్రతీ చిత్రానికీ గమ్మత్త్తెన పేరుండేలా చూసుకొంటుంటాడు. తాజాగా చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెట్టే టైటిల్ తోనే ఎట్రాక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఈ ప్రయత్నమంతా అంటున్నారు. అయితే అదేమీ కాదు ఫ్రీ పబ్లిసిటీ కోసం ఈ తిప్పలు..యూనిట్ ఆల్రెడీ ఓ టైటిల్ ని ఫైనలైజ్ చేసేసే ఉంటుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

తన సినిమాకి టైటిల్ పెట్టమంటూ అల్లరి నరేష్ మీడియా ద్వారా ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి చిత్రానికి 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' అనే పేరుని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇందులో అన్నగా అల్లరి నరేష్‌, చెల్లెలుగా రాధ తనయ కార్తీక నటిస్తోంది. వారిద్దరి మధ్య సాగే కథ కాబట్టి... 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' అని పేరు పెట్టినట్టు సమాచారం. అయితే 'నాటుబాంబు' అనే మరో టైటిల్ నీ పరిశీలిస్తున్నారు. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూసి టైటిల్ పై ప్రకటన ఇచ్చే ప్లానింగ్ లో యూనిట్ ఉందని తెలుస్తోంది.

 Allari Naresh title hunt...Publicity Stunt

సిరి సినిమా పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇందులో నరేష్‌ సరసన హీరోయిన్ గా మోనాల్‌ గజ్జర్‌ నటిస్తోంది. ఆడియో ఈనెలాఖరున విడుదల చేసి, సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు.

ఈ సినిమాకి పాటలు భాస్కరభట్ల రాయగా, కెమెరా-విజయకుమార్, ఫైట్స్-రామ్‌లక్ష్మణ్ సమకూరుస్తున్నారు. వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ తల్లిదండ్రులుగా సురేఖావాణి, కాశీవిశ్వనాధ్‌లు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X