అల్లరి రవిబాబు మీడియాపై కోపం తెచ్చుకోవటానికి కారణం
అల్లరి రవిబాబు ఈ మధ్య కాలంగా మీడియాను దూరం పెడుతూ వస్తున్నాడు. అందుకు సాక్ష్యం తాను ప్రస్తుతం రూపొందిస్తున్న 'మనసారా' చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశం కాని ప్రెస్ రిలీజ్ కాని ఇప్పటివరకు చేయలేదు. ఇప్పటికే 'మనసారా' చిత్రం ఆడియో విడుదలై 15 రోజులు కావస్తున్న రవిబాబు తన సినిమాకు సంబంధించిన స్టిల్స్ గానీ, న్యూస్ మీడియాకు ఇవ్వలేదు. దానికి కారణం...ఆయన దర్సకత్వం వహించిన అమరావతి రివ్యూలేనంటున్నారు. ఆ రివ్యూలు నెగిటివ్ గా రావటంతో ఆయన చాలా హర్ట్ అయ్యారని, అందుకే మీడియాని ప్రక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త చిత్రాన్ని మీడియా సహకారం లేకుండానే జనాల ముందుకు తీసుకువచ్చి హిట్ కొట్టి మీడియాకి సమాధానం చెప్పే ప్రయత్నంలో ఉన్నాడట.
ఇక ఈ కొత్త చిత్రం 'నచ్చావులే' తరహాలో టీనేజ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే నచ్చావులే చిత్రంలో కొత్త జంటను పరిచయం చేసినట్లే ఈ తాజా చిత్రంలో కూడా విక్రమ్, దియా అనే జంటను తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. కేరళ నేపధ్యంలో నడిచే ఈ ప్రేమ కధకు శేఖర్ చంద్ర మ్యూజిక్ ను అందించాడు. చాలా చిన్న బడ్జెట్ లో మనస్సుకు హత్తుకునేలా ఈ లవ్ స్టోరీని చిత్రీకరించాడని, మళ్ళీ తన మ్యాజిక్ ని రిపీట్ చేయనున్నాడని అంతటా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











