అల్లు అరవింద్ ని టెన్షన్ పెడుతున్న రవితేజ...!
అల్లు అర్జున్ నటించిన 'బద్రినాథ్" విడుదలవుతోందని రవితేజ టెన్షన్ పడుతున్నాడని, 'వీర" సినిమాని అది డామినేట్ చేసి ప్లాప్ చేస్తుందని కంగారు పడుతున్నాడని మీడియాలో వార్తలొస్తున్నాయి. బద్రినాథ్ గురించి రవితేజకి టెన్షన్ ఉందో లేదో కానీ వీర సినిమా గురించి మాత్రం అల్లు అరవింద్ అండ్ కో తెగ వర్రీ అవుతోంది. ప్రస్తుతం మంచి కలెక్షన్లు రాబట్టుకుంటున్న 100%లవ్ ని వీర ఎక్కడ ప్రభావితం చేస్తుందోనని అల్లు బృందం టెన్షన్ పడుతోంది. రవితేజ సినిమా అంటే అటు మాస్ తో పాటు ఇటు క్లాస్ కూడా వచ్చేస్తుంటారు కాబట్టి చిన్న చిత్రమైన 100%పై ప్రభావం అయితే తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఈ చిత్రం ఎంత విజయం సాధించిందనే దానిపై 100% నిలబడడమో, పడిపోవడమో జరుగుతుంది. అందుకే వీర టాక్ తెలుసుకునేందుకు అందిరికంటే ఎక్కువగా అల్లు అరవిందే ఉద్వేగంగా ఉన్నాడట...
veera ravi teja allu aravind 100% love badrinath allu arjun వీర రవితేజ అల్లు అరవింద్ 100% లవ్ బద్రినాథ్ అల్లు అర్జున్


Click it and Unblock the Notifications