వారికి భయపడి మెగాస్టార్ ‘చిరు’ను ఆహ్యానిస్తారో...లేదో..?
తనకు చెప్పకుండా ఏ పనీ చేయడం కాని, తన అనుమతి లేకుండా, తన అభీష్టానికి విరుద్దంగా ఏ నిర్ణయం తీసుకోవడం కానీ చేయని తన బామ్మర్ది చిరంజీవిని పిలవకుండా అల్లు అరవింద్ కూడా ఏ సినిమా ఫంక్షనూ చేయరు. అయితే మొట్టమొదటిసారిగా 'వరుడు", ఆ తర్వాత 'వేదం" ఆడియో ఫంక్షన్ కు కూడా చిరును దూరంగా ఉంచారు. అల్లు అర్జున్ హీరో అయ్యాక..అతను నటించిన అన్ని సినిమా ఫంక్షన్లలోనూ అతిధిగా పాల్గొనడం చిరంజీవికి ఓ ఆనవాయితీగా మారిపోయింది. కానీ..మొట్టమొదటిసారిగా పై రెండు చిత్రాల ఆడియో ఫంక్షన్స్ లో మాత్రమే చిరంజీవి పాల్గొనలేదు.
ఈ నేపధ్యంలో మరో మూడు రోజుల్లో జరగబోతున్న'పులి" ఆడియో ఫంక్షన్ కు చిరంజీవిని ఆహ్వానిస్తారా లేదా అనే చర్చ మెగాబిమానుల్లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్లు కూడా ఇప్పటివరకూ చిరంజీవి లేకుండా జరగలేదు. పైగా ఈ చిత్రానికి అనధికార నిర్మాత అల్లు అరవిందేనని ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. మరి ఆగస్టు 12న విడుదల చేయబోతున్న 'పులి" చిత్రానికి ఆడియో ఫంక్షన్ తో భీభత్సమైన ప్రచారం నిర్వహించి..సినిమా బాగుండడం..బాగుండకపోవడంతో పనిలేకుండా మొదటి వారం రోజుల్లోనే సినిమాకు పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టుకోవాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు.
కాబట్టి..సమైక్యవాదం ఆలపిస్తున్న చిరంజీవిని చూసి మండిపడుతున్న తెలంగాణావాదులకు భయపడి 'పులి" పాటల ఫంక్షన్ కు కూడా చిరంజీవిని ఆహ్వానించకూడదని అల్లు అరవింద్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది..!


Click it and Unblock the Notifications











