twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ దెబ్బకు డ్రీమ్ ప్రాజెక్టుపై ఆశలు వదులుకున్న అల్లు అరవింద్..

    |

    సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా క్రేజ్ అందుకున్న తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఎలాంటి సినిమా నిర్మించినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకునేలా ఉంటుంది. ఒక సినిమాకు ఎంత ఖర్చు చేస్తే పదింతల లాభం వస్తుంది అనే విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాయి మరింత పెరిగేలా గత కొన్నేళ్లుగా ఒక బడా ప్రాజెక్టుపై చర్చలు జరుపుతున్నారు.

     బాహుబలి కంటే హై రేంజ్ లో..

    బాహుబలి కంటే హై రేంజ్ లో..

    బాహుబలి ఇచ్చిన నమ్మకంతో పాన్ ఇండియా సినిమాలను అంతకంటే హై రేంజ్ లో నిర్మించాలని గీతా ఆర్ట్స్ క్రేజ్ ని దేశవ్యాప్తంగా పెంచాలని అనుకున్నారు. అయితే ఇంతలో ప్రభాస్ ఒక విధంగా షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే రామాయణం కథను ముందుగా పాన్ ఇండియా సినిమాగా రూపొందించాలని అల్లు అరవింద్ ప్లాన్ వేసుకున్నారు.

     రామాయణ కథపై చర్చలు

    రామాయణ కథపై చర్చలు

    హిస్టారికల్ నవలలు రాసే టాప్ రైటర్స్ తో కూడా అల్లు అరవింద్ చాలా సార్లు రామాయణ కథపై చర్చలు జరిపారు. టాప్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకొని కొంతమంది బాలీవుడ్ బడా నిర్మాతలతో కలిసి సినిమాను నిర్మించాలని అనుకున్నారు. రాముడిగా దాదాపు హృతిక్ రోషన్ ఫిక్స్ అయినట్లు కూడా టాక్ వచ్చింది.
    అయితే సడన్ గా లాక్ డౌన్ మొదలైనప్పుటి నుంచి మళ్ళీ అందుకు సంబంధించిన చర్చలు జరగలేవట.

     ఆశలు వదులుకోక తప్పడం లేదు

    ఆశలు వదులుకోక తప్పడం లేదు

    పరిస్థితులు చక్కబడిన తరువాత కూల్ గా ఆలోచిద్దాం అనుకునే లోపే రెబల్ స్టార్ ప్రభాస్ ఎనౌన్స్మెంట్ తో షాక్ తగిలినట్లయ్యింది. దాదాపు 500కోట్ల బడ్జెట్ తో ఓం రావత్ దర్శకత్వంలో ఆది పురుష్ గా రామాయణం కథను తెరకెక్కించడానికి సిద్ధమవ్వడంతో గీత ఆర్ట్స్ టీమ్ ఆ కథపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Prabhas సెల్పీ పై కామెంట్స్, Fitness గాలికొదేలిశాడు | TROLLS
     డ్రీమ్ ప్రాజెక్ట్ లేనట్లే..

    డ్రీమ్ ప్రాజెక్ట్ లేనట్లే..

    ప్రభాస్ లాంటి స్టార్ హీరో రామాయణం కథను టచ్ చేస్తున్న తరువాత మళ్ళీ ఎంత కొత్తగా తీసినా కూడా ఆ కిక్కు ఉండకపోవచ్చు. అందుకే అల్లు అరవింద్ అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఊహించని విధంగా క్యాన్సిల్ అయినట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం అల్లు అరవింద్ జెర్సీ సినిమాను హిందీలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే టాలీవుడ్ లో కూడా మరో రెండు పెద్ద ప్రాజెక్టులకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.

    English summary
    Telugu producer Allu Arvind, who has received a craze as a top director in South India, is expected to receive a minimum of Rs. The decisions he makes and the steps he takes are very different in terms of how much he spends on a film. Geeta Arts has been in talks for the last few years on a big project to further raise the banner level.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X