»   » అరవింద్ మహా మాయగాడు...బడా నిర్మాతలు నేర్చుకోవాల్సిందే..!

అరవింద్ మహా మాయగాడు...బడా నిర్మాతలు నేర్చుకోవాల్సిందే..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అరవింద్ మహా మాయగాడు..మాటలతోనే కోటలు దాటించగల సమర్థుడు. ప్రస్తుతం తన కొడుకు అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించిన 'బద్రినాథ్" టాక్ గొప్పగా లేనప్పటికీ ఈ చిత్రం ఇరగాడేస్తోందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు. అల్లు అరవింద్. 'బద్రినాథ్"కి కావల్సినంత పబ్లిసిటీ ఇచ్చి సినిమాని నిలబెట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతో 'బద్రినాథ్" వసూళ్లు బాగానే ఉన్నాయి.

బద్రినాథ్" చిత్రానికి అట్టర్ ప్లాప్ టాక్ వచ్చినా కానీ తొలి వారంలో వసూళ్లు బ్రహ్మాండంగా వచ్చాయి. రెండవ వారంలో కూడా బద్రినాథ్ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. నెమ్మదిగా ఈ సినిమాని సేఫ్ జోన్ లో చేర్చి హిట్ చేసేసేలా ఉన్నారనిపిస్తోంది. ఇంచుమించు ఇలాంటి కథాంశంతోనే రూపొందిన 'శక్తి"కి కూడా ఇదే టాక్ వినిపించింది. అయితే శక్తి సినిమాని రెండో రోజునుంచే కిల్ చేసేశారు..

పాపం..అశ్వనీదత్ కి ఈ కిటుకులు తెలియవు. కాబట్టే 'శక్తి"ని ఇలా నిలబెట్టడం కోసం ప్రయత్నాలు చేయకుండా వదిలేశాడు. ఒకవేళ అశ్వనీదత్ కూడా అల్లు అరవింద్ లా పబ్లిసిటీ ఇచ్చి జనాలను మాయ చేసి ఉండి ఉంటే..'శక్తి" అంత ఘోరంగా ప్లాప్ అయ్యుండేది కాదని పరిశీలకులు అంటున్నారు.

English summary
Telugu film industry mega producer Allu Aravind once again showed his typical stand of a father and producer in terms of doing business. He is unable to bear the image and craze that’s being shown on a raising star Naga Chaitanya and instead favoring his son Allu Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu