'మగధీర' హిందీ రీమేక్ కోసం ఆ హీరోతో చర్చలు!?
తెలుగులో ఘన విజయం సాధించిన మగధీర చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు. ఇందు నిమిత్తం ఆయన బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రం రీమేక్ కు ఒప్పుకోని హృతిక్ వరసగా తన చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం, ఎంతో ఆశలు పెట్టుకున్న గుజారిష్ డిజాస్టర్ కావటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ వరసగా సౌత్ సినిమాల రీమేక్ లతో చెలరేగిపోవటం కూడా హృతిక్ ని ప్రేరేపించిందని చెప్తున్నారు.ఇక అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ లోని నిర్మాణ సంస్ధతో టై అప్ పెట్టుకుని గజనీలా ఘనవిజయం సాధించే చిత్రం చేయాలనే తలంపుతోనే రాకేష్ రోషన్ ని కలసి ఈ ప్రపోజల్ పెట్టినట్లు చెప్తున్నారు. అంతేగాక హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతం అయిన జోధా అక్బర్ చిత్రం మ్యాజిక్ ని రిపీట్ చేసినట్లు ఉంటుందని, రాజుల గెటప్ లో హృతిక్ మరోసారి కనపడటం అతని ఫ్యాన్స్ ని తప్పనిసరిగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











