‘చిరు’ ప్రమేయంతో కూడా కుదరని అల్లు అరవింద్ ‘మాఫియా’ డీల్..!?
'100% లవ్" చిత్ర పైరసీకి పివీఆర్ సినిమా హాళ్ల యాజమాన్యమే కారణమంటూ అయిదు కోట్లు దావా వేసిన అల్లు అరవింద్ కి ఇప్పుడో కొత్త చిక్కొచ్చింది. సినిమా పరిశ్రమ కళకళలాడాలని కోరుకునే మా మీదే అల్లు ఇలా ఫైర్ అవడం ఏంటని అవాక్కయిన పీవీఆర్ యాజమాన్యంలోని కొందరు వ్యక్తులు ఈ విషయంపై మాఫియాను ఆశ్రయించినట్టు కొత్త పుకారు మొదలైంది. అయితే అల్లు అరవింద్ చిరంజీవి ఇన్ ఫ్లూయన్స్ ను ఉపయోగించి దీన్ని పెద్ద ఇష్యూ చేసి 5 కోట్లు కొట్టాయాలనుకొన్నాడో ఏమోకానీ అది కాస్తా ముంబాయ్ మాఫీయా దగ్గర పనిచేయకపోవడంతో అల్లు అరవింద్ ఖంగుతిన్నాడు...
నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాల మధ్య వుండాల్సిన సామరస్యమైన వాతావరణాన్ని ఇలా అరవింద్ స్వంత ప్రయోజనాలకు వాడుకోవడం, తెలిసి తెలిసి తమ థియేటర్లలో పైరసీకి వాడే కెమెరాలను ఏ యాజమాన్యం లోనికి అనుమతించదని అరవింద్ కి తెలియజెప్పేలా మాఫియాలోని కొందరు పెద్ద తలలకి యాభై లక్షలు ముట్టజెప్పినట్టు బాలీవుడ్ లో ఓ వార్త బయల్దేరింది. మరీ అయిదు కోట్ల సమస్యను ఇలా యాభై లక్షలతో పీవీఆర్ క్లోజ్ చేయాలనుకుందేమో...?


Click it and Unblock the Notifications











