చిన్నికృష్ణ మరో ఛాన్స్ ఇచ్చిన అల్లు..
ఇటీవల 'బద్రీనాథ్' వంటి భారీ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థ, త్వరలో మరో భారీ చిత్రానికి సన్నాహాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సినిమాకి చిన్నికృష్ణ ఓ కథ చెప్పాడట. అది బాగుండడంతో దానినిప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు.
'రచయిత చిన్నికృష్ణ మా కోసమే అన్నట్టుగా వున్నాడు. మా బ్యానర్లో గతంలో గంగోత్రి, ఇప్పుడు బద్రీనాథ్ సినిమాలకు కథ ఇచ్చాడు. ఇప్పుడు మరో కథ చెప్పాడు. అది త్వరలో ఫైనల్ చేస్తున్నాం"అన్నారు. ఈ బ్యానర్లో తాను మూడో సినిమా కూడా చేస్తున్నందుకు ఆనందంగా వుందని చిన్నికృష్ణ చెప్పాడు. అయితే, ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ నటిస్తాడా? లేక అల్లు శిరీష్ నటిస్తాడా? అనేది వెల్లడి కాలేదు.
chinni krishna allu aravind badrinath allu arjun allu sirish చిన్నికృష్ణ అల్లు అరవింద్ బద్రినాథ్ అల్లు అర్జున్ అల్లు శిరీష్


Click it and Unblock the Notifications