అడ్డు పడిన అల్లు అరవింద్.. ఇరకాటంలో త్రివిక్రమ్.. చిక్కుముడి వీడేదెలా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో ఏ రేంజ్ ప్రకంపనలు సృష్టిస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. సంక్రాంతి బరిలోకి దిగి ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు బన్నీ. ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం గురించి తాజాగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.

బాలీవుడ్‌కు ‘అల'..

బాలీవుడ్‌కు ‘అల'..

సౌత్ సినిమాలపై కన్నేసే బాలీవుడ్.. వాటితో బాగానే సొమ్ము చేసుకుంటోంది. గతేడాది అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం జెర్సీ సినిమానూ అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇలా మన కథలకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అల వైకుంఠపురములో చిత్రం కూడా అక్కడికి పయనమవుతున్నట్లు టాక్.

సల్మాన్ హీరోగా..

సల్మాన్ హీరోగా..

మన తెలుగు కథలపై సల్మాన్ ఖాన్‌కు మోజు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి పోకిరి చిత్రాన్ని వాంటెడ్‌గా రీమేక్ చేసి సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. రెడీ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేసి భారీ హిట్టు కొట్టాడు. మరోసారి తెలుగు కథపై కన్నేశాడని తెలుస్తోంది.

భారీ రేటుకు రీమేక్ హక్కులు..

భారీ రేటుకు రీమేక్ హక్కులు..

అల వైకుంఠపురములో చిత్ర హక్కులను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు దాదాపు 7కోట్లకు అమ్మాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. దీనికోసం ఇద్దరు మధ్యవర్తులు కూడా బాగానే పని చేశారని సమాచారం. త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని కలిసి ఈ డీల్‌ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. అయితే మధ్యలో అరవింద్ ఎంటర్ కావడంతో వ్యవహారం అక్కడే ఆగిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Interesting Fact About Trivikram Srinivas | Is This The Reason Behind Trivikram's Flops & Hits?
తానే చేస్తానంటూ..

తానే చేస్తానంటూ..

ఇలా రీమేక్ హక్కులు అమ్మొద్దని, తానే ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మిస్తానని అల్లు అరవింద్ అన్నట్టు వినికిడి. ఇప్పటికే జెర్సీ చిత్రంతో మరోసారి బాలీవుడ్‌కు వెళ్లిన అల్లు అరవింద్.. అల చిత్రాన్ని కూడా తానే నిర్మించాలని భావిస్తున్నాడట. అందుకే ఆ డీల్‌ను క్యాన్సల్ చేయమని అన్నట్టు భోగట్టా. అయితే ఎలాగైనా ఈ డీల్‌ను ఓకే చేయిస్తానని అవతలి పార్టీకి త్రివిక్రమ్ మాటిచ్చినట్టు, ఈ విషయమై అల్లు అరవింద్‌తో చర్చించాలని గురూజీ ప్రయత్నిస్తున్నాడట. మరి చిక్కుముడి ఎలా ఎప్పుడు వీడుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X