11ఏళ్ల తరువాత అరుంధతి రీమేక్.. హిందీలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో అరుంధతి ఒకటి. అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా 2009లో విడుదలై అప్పటివరకు ఉన్న పాత రికార్డులను ఒక్క వారంలోనే బ్రేక్ చేసింది. ఆ సినిమాతో అనుష్క్ కెరీర్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఇక 11ఏళ్ళ తరువాత ఆ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కోడి రామ కృష్ణ దర్శకత్వంలో మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో రూపొందించిన ఆ విజువల్ వండర్ ని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని మెగా ప్రొడ్యూసర్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సరైన కాంబినేషన్న సెట్టవ్వక చర్చల దశలోనే ఉండిపోయింది. ఇక ఇన్నాళ్లకు అల్లు అరవింద్ ఆలోచనతో మళ్ళీ ఆ కథ చర్చల్లోకి వచ్చిందట.

ఇటీవల సినిమా హిందీ హక్కులను అల్లు అరవింద్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పాంథన్ ఫిలిమ్స్ మధు మంతెనతో కలిసి అల్లు అరవింద్ బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక సినిమాలో అసలైన హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తారనేది అందరిలో ఎక్కువగా ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ లో అయితే టాప్ హీరోయిన్ గా ఉన్న దీపికా పదుకొనె అయితే బావుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక విలన్ పాత్రకు సోనూ సూద్ ని తీసుకుంటారా లేక మరొకరిని సంప్రదిస్తారా అనేది చూడాలి. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని మెగా ప్రొడ్యూసర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











