అల్లు అరవింద్ కి హ్యాండిచ్చారా..!?మరి బద్రినాథ్, మగధీర పరిస్థితేంటి..?
అల్లు అరవింద్ తో జత కట్టిన ముహూర్త బలమో, లేక వారికదే ప్రాప్తమో తెలీదు కానీ అంతవరకు తమిళ చిత్ర సీమలో మోనోపలీ సాగించిన రెడ్ జయింట్ ఫిలింస్ ఒక్కసారిగా కుదేలయింది. కరుణానిధి కుటుంబానికి చెందిన ఈ సంస్థ అధికారాన్ని వాడుకుని తమిళ చిత్ర పరిశ్రమని శాసించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో డిఫెన్స్ లో పడింది. గతంలో మాదిరిగా చిత్ర పరిశ్రమలో వేషాలేస్తే జయలలిత తమ తోక కత్తిరించి పారేస్తుంది. కాబట్టి వారు జాగ్రత్త పడుతున్నారు. వచ్చిన ప్రతి సినిమానీ కొనేస్తున్న వాళ్లు కాస్తా ఇప్పుడు బాగా వెనక్కి తగ్గారు.
ఈ నేపథ్యంలో తాము అడ్వాన్సులిచ్చి ఒప్పందాలు చేసుకున్న సినిమాలని కూడా వదిలేసుకుంటున్నారు. మగధీర తమిళ వెర్షన్ ని సొంతం చేసుకున్నాక కూడా చివర్లో హ్యాండిచ్చి తప్పుకున్నారు. చాలా కాలం తాత్సారం చేసి ఎట్టకేలకు మే 27న తమిళంలో మగధీర విడుదల చేస్తున్న అల్లు అరవింద్ ఇక చేసేది లేక తానే స్వయంగా తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు. తెలుగులో మాదిరిగా అక్కడ గీతా ఆర్ట్స్ కి పంపిణీ రంగంలో పెద్దగా పట్టు లేదు కాబట్టి మగధీర, బద్రినాథ్ చిత్రాలని అక్కడ ఎంతవరకు నిటబెట్టగలరనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications