‘బద్రినాథ్’ కలెక్షన్స్ పై అల్లు అరవింద్ మాయాజాలం పనిచేస్తుందా..!?
సినిమా అసలు సంగతెలా ఉన్నా అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ పైన విడుదలయ్యే చిత్రాలకు ఓపెనింగ్ కలెక్షన్లు వరదలై పారుతాయాని కొత్తగా చెప్పక్కర్లేదు. ప్లాపు టాక్ సొంతం చేసుకున్న సినిమాలు సైతం మొదటి రెండు వారాల్లోనే నిర్మాతలను, పంపిణీదారులను ఒడ్డున చేర్చే మంత్రం అల్లు అరవింద్ బుర్రలో వుంది...
బద్రినాథ్" మొదటి రోజునే ఏడుకోట్లు పైగా కలెక్ట్ చేస్తే ఇంకెందుకు నిర్మాత అల్లు అరవింద్కు భయం? ఆయన పెట్టిన నలభై కోట్లు నాలుగైదు వారాల్లోనే కొల్లగొడుతారుగా అని అనుకుంటే తప్పేనంటున్నారు ట్రేడ్ పండితులు. చిత్రం పట్ల పెరుగుతున్న బ్యాడ్ టాక్ ఎంతలా రెండో వారం కలెక్షన్ల మీద ఎఫెక్ట్ చూపుతుందో అన్నది గీతా ఆర్ట్స్ వారికి గుబులు పుట్టిస్తోంది.
ఎన్ని రకాలుగా ఆలోచించినా అల్లు అర్జున్ మార్కెట్ పాతిక కోట్లు మించదు కనుక అల్లు అరవింద్ పది నుండి ఇరవై వరకూ నష్టపోవచ్చని ముందే ఫిక్సయిపోవచ్చు. ఇంకొందరు మాత్రం అల్లు వారికి పోయేదేమీ లేదు, 'మగధీర" మరియు '100%లవ్"ల మీద పొందిన లాభాల్లో కొంత వాటా తగ్గిందని అనుకుంటే 'బద్రినాథ్" పరాజయం తేలికగా అనిపించొచ్చు అని ఉపశమనం కల్గించే మాటలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











