»   » పవన్ కళ్యాణ్ ‘పులి’ పై ఎత్తుగడ వేసి మాస్టార్ మైండెడ్ అల్లు అరవింద్!

పవన్ కళ్యాణ్ ‘పులి’ పై ఎత్తుగడ వేసి మాస్టార్ మైండెడ్ అల్లు అరవింద్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎస్ జె సూర్య దర్శకత్వంలో దాదాపు రెండు ఏళ్ళ నుండి షూటింగ్ జరుపుకుంటున్న పులి చిత్రాన్ని నిర్మాత శింగనమల రమేష్ అమ్మివేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమాని కొన్నది అక్షరాల మాస్టర్ మైండెడ్ అల్లు అరవిందే. ఈ చిత్రాన్ని అతను కొనడానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి తనయుని చిత్రం కాపాడుకోవడం కోసం..సుమారు రెండు ఏళ్ళ నుండి పవన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. మరి ఆ చిత్ర విడుదల సమయంలోనే అల్లుఅర్జున్ నటించిన వరుడు చిత్రం కూడా విడుదల ఉండటంతో, ఇప్పటికే ఆర్య-2తో దెబ్బతిన్న అల్లు అర్జున్ కొంచెం రిలాక్స్ అవ్వాలంటే 'వరుడు" గట్టిగా నిలబడాలి. అందుకే పులిని సైడ్ ట్రాక్ లోనికి లాగుతున్నాడని సమాచారం.

మరో విషయం ఏమిటంటే గతంలో యువరాజ్యం పదవి స్వీకరించి పీఆర్పీ పార్టీకి బలాన్ని చేకూర్చితను కోరిన అభ్యర్థులకు సీటు ఇవ్వాలని కోరినా పవన్ మాటను లెక్కచేయక పోవడంతో..అల్లు అరవింద్ పై కోపంతో ఉన్న పవన్ కళ్యాణ్ ను శాంతింపజేయడానికే ఈ చిత్రంను అల్లు తీసుకున్నట్టుగా, వార్తలు వస్తున్నాయి. అంతే కాదు 3 ఇడియట్స్ తనకు ఎంతగానో నచ్చిందని టాలీవుడ్ రీమేక్ లో నటించాలని ఉంది అని పవన్ కళ్యాణ్ మటాలను విన్న అల్లు అరవింద్..అతన్ని మచ్చిక చేసుకోవడానికి ఆ చిత్ర హక్కుటను తీసుకుని పవన్ కు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే మగధీర చిత్రం తన కుమారుడు చేయకుండా, రామ్ చరణ్ చేసినందుకు బాధపడుతున్న అల్లు అరవింద్, పవన్ 'పులి"ని అడ్డుకుని కొడుకు సినిమాకు ప్రాణం పోయాలనుకుంటున్నాడు అనే మాటల్లో వాస్తవం ఉండే ఉంటుంది అంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu