బన్నీ, సుకుమార్ చిత్ర ప్రకటనలో కొత్త కోణం.. ముందురోజే నమ్రతని కలసిన అల్లు అరవింద్!
Recommended Video

మహర్షి చిత్రం తర్వాత మహేష్ సుకుమార్ దర్శత్వంలో నటించాల్సిఉంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి అనేక వార్తలు వచ్చాయి. కాస్త ఆలస్యమైనా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందని అంతా భావిస్తున్న తరుణంలో మహేష్ బాబు సుకుమార్ దర్శత్వంలో నటించడం లేదని ప్రకటించాడు. అంతకు ముందు రోజే అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు ప్రకటన జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది.

బన్నీ, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్
రంగస్థలం చిత్రం తర్వాతే మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్, మహేష్ బాబు చిత్రానికి ప్రకటన జరిగింది. కానీ ప్రస్తుతం మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రం పూర్తి కావస్తున్నా సుకుమార్ కథ సిద్ధం చేయలేదు. దీనితో సుకుమార్ దర్శత్వంలో మహేష్ చిత్రం మరింత ఆలస్యం అవుతుందని అంతా భావించారు. ఇలాంటి తరుణంలో సడెన్ గా శివరాత్రి సందర్భంగా అల్లు అర్జున్, సుకుమార్ కొత్త చిత్రానికి ప్రకటన జరిగింది. ఆ మరుసటిరోజే మహేష్ తాను సుకుమార్ దర్శత్వంలో నటించడం లేదని, అతడి కొత్త చిత్రానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేసేశాడు.

కారణాలు ఏంటి
ఈ ఎపిసోడ్ టాలీవుడ్ లో చర్చినీయాశంగా మారింది. మహేష్, సుకుమార్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి చాలా కారణాలు వినిపిస్తున్నాయి. సుకుమార్ సిద్ధం చేసిన కథలు ఏవీ మహేష్ కు నచ్చలేదట. మరో వైపు వేగంగా షూటింగ్ జరపాలని మహేష్ సుకుమార్ కు కండిషన్ పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుకుమార్, మహేష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కూడా తప్పుకుంది.

కొత్త కోణం
సుకుమార్, బన్నీ ప్రాజెక్ట్ ప్రకటనకు సంబంధించి మరో కొత్త కోణం తెరపైకి వచ్చింది. సుకుమార్, బన్నీ కాంబినేషన్ మూడవసారి సెట్ కావడం వెనుక అల్లు అరవింద్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అనౌన్సమెంట్ కు ముందురోజు అల్లు అరవింద్ నమ్రతని కలిశారట. మహేష్ రిజెక్ట్ చేసిన సుకుమార్ కథపై బన్నీ ఆసక్తి చూపుతున్నాడని అల్లు అరవింద్ నమ్రతతో అన్నట్లు తెలుస్తోంది.

ఒకేసారి షూటింగ్
ఇదిలా ఉండగా మహేష్ మాత్రం సుకుమార్ సరైన కథతో వస్తే సమ్మర్ తర్వాత ఈ చిత్రంతో పాటు అనిల్ రావిపూడి చిత్రాన్ని కూడా ఒకేసారి పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో బన్నీ, సుకుమార్ చిత్రానికి ప్రకటన రావడంతో మహేష్ తాను తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











