Ramayanam: అల్లు అరవింద్ 'రామాయణం'లో రావణుడిగా 'కేజీఎఫ్' హీరో.. సీతారాములు ఎవరంటే?
రామాయణం.. భారతీయులకు ఎంతో పవిత్రమైన గాథ, గ్రంథం. ఈ మహాకావ్యంలోని పాత్రలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ముఖ్యంగా రాముడు ఆచరించే విలువలు, ధర్మం, సత్యాన్ని నిజమైన మనిషికి కోలమానంగా చెబుతారు. రామాయణంపై ఎన్ని చిత్రాలు వచ్చిన వీక్షించేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు. ఇక రాముడి పాత్రలో స్వర్గీయ ఎన్టీఆర్, శోభన్ బాబుతో సహా ఎంతోమంది అలరించారు. ఇప్పుడు 'ఆదిపురుష్' ద్వారా ప్రభాస్ కనువిందు చేయనున్నాడు. అయితే 'ఆదిపురుష్' ద్వారా చిత్రసీమలో ఆసక్తినెలకొన్న వేళ రామాయణం గాథతో వచ్చే మరో సినిమా నటీనటులపై చర్చ నడుస్తోంది. ఆ మూవీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మరో రామాయణం : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ సీతగా, రావణ బ్రహ్మగా సైఫ్ అలీఖాన్ నటించిన సినిమా ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోగా.. ఇప్పుడు మరో రామాయణం గాథపై చర్చ నడుస్తోంది.

నటుడి కారణంగా : ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని నిర్మిస్తారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. అల్లు అరవింద్.. మధు మంతెన, బాలీవుడ్ ఫిలీం మేకర్ నితేష్ తివారితో కలిసి దాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణుడి పాత్రకు సరైన నటుడు దొరక్కపోవడంతో మూవీని ఆపినట్లుగా ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా వినిపిస్తున్నా మాట.

ఈ ఏడాదిలోనే : అయితే ఇప్పుడు ఎట్టకేలకు అల్లు అరవింద్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ రామాయణం పట్టాలెక్కనుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 7న డైరెక్టర్ నితేష్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయింది. ప్రస్తుతం సమాచారం మేరకు ఈ రామాయణం సినిమాను డిసెంబర్ 2023 నాటికి సెట్స్ పైకి తీసుకురావాలని నితేష్ భావిస్తున్నారట.

రాముడి పాత్రకు : అంతేకాకుండా అల్లు అరవింద్ రామాయణంలో నటించే కాస్టింగ్ వివరాలు కూడా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ విజువలైజేషన్ ఇప్పటికే పూర్తయింది. రావణుడి పాత్రలో కేజీఎఫ్ తో మాసీవ్ హిట్ కొట్టిన యశ్ ను ఫిక్స్ చేశారట. ఇక రాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్ లుక్ టెస్ట్ చేస్తోందట మూవీ టీమ్.

సీతగా బాలీవుడ్ భామ : ఈ రామాయణం చిత్రానికి సీతగా అలియా భట్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే రణ్‌బీర్, అలియా భట్ ముంబైలోని DNEG ఆఫీస్ కు తరచూ వస్తున్నారట. ఈ కార్యాలయాన్ని రామాయణం ఆఫీస్ అని పిలవడమే కాకుండా.. నితేష్ తివారీ, మధు వంతెన టీమ్ ప్రీ విజువలైజ్డ్ వరల్డ్ క్రియేట్ చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

రియల్ లైఫ్ కపుల్స్ : రాముడిగా రణ్‌బీర్, సీతగా అలియా భట్ దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ దీపావళకి ప్రకటన కూడా వెలువడనుందని టాక్. కాగా ఈ రామాయణం సినిమాకు మొదటి ఎంపిక అలియా భట్ అనుకున్నప్పటికీ అనేక కారణాల వల్ల డేట్స్ కుదర్లేదట. తర్వాత అనేక ఆప్షన్స్ వెతికి.. చివరికీ మళ్లీ అలియానే సెలెక్ట్ చేశారట మేకర్స్. దీంట్లో రియల్ లైఫ్ కపుల్స్ సీతారాములుగా నటించనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











