తమన్నా అందాలను తెలివిగా ఉపయోగించుకొంటున్న అల్లు అరవింద్..!
బద్రినాథ్ సినిమాలో ప్రత్యేకతలు ఏమున్నాయో, ఎన్నున్నాయో ఏమో కానీ..ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మాత్రం తమన్నా అందాలేనని గీతా ఆర్ట్స్ బృందం బలంగా నమ్ముతున్నట్టుంది. మగధీర చిత్రానికి కాజల్ పై అస్సలు ఆధారపడని అల్లు అరవింద్ బద్రినాథ్ కి వచ్చేసరికి తమన్నాని బాగా హైలైట్ చేస్తున్నాడు. పైగా ఆమె ఎక్స్ పోజింగ్ చేసిన స్టిల్స్ మాత్రమే ప్రెస్ కి రిలీజ్ చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచాలని చూస్తున్నాడు..
కోటానుకోట్లు ఖర్చుపెట్టిన సినిమాలో అదనపు హంగులు, ఆకర్షణలు కాకుండా తమన్నా అందాల్ని హైలైట్ చేయడం పలు అనుమానాలకి తావిస్తోంది. క్విక్ మనీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారని కామెంట్స్ పడుతున్నాయి. 100% లవ్ సినిమాలో కూడా తమన్నా నడుముపై పలు సన్నివేశాలున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ హిట్స్ కావాలంటే స్త్రీలని వీలయినంతగా పబ్లిసిటీకి వాడుకోవాలనే సూత్రాన్ని అరవింద్ నమ్ముతున్నట్టున్నాడు..


Click it and Unblock the Notifications











