ఇది నిజమైతే అభిమానులకు పండగే.. ఆ హీరోతో మహేష్ బాబు మల్టీస్టారర్, మెగా ప్లాన్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోలతో చాలా ఫ్రెండ్లిగా ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే అది కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు. వివాదాలకు కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉండే మహేష్ తన మనసులో అనుకున్న విషయాన్ని మాత్రం చేలా ఈజీగా బయటకు చెప్పేస్తాడు. ఇక మహేష్ లాంటి హీరో భారీ స్థాయిలో మల్టీస్టారర్ సినిమాలు చేస్తే బావుంటుందని అభిమానులు కోరుకుంటున్న సమయంలో ఇండస్ట్రీలో ఒక షాకిచ్చే న్యూస్ వైరల్ అవుతోంది.

ప్రిన్స్ తో మల్టీస్టారర్ చేయాలని

ప్రిన్స్ తో మల్టీస్టారర్ చేయాలని

మహేష్ బాబు అంటే ఇతర స్టార్ హీరోలు కూడా ఎంతో ఇష్టపడతారు. ప్రిన్స్ తో మల్టీస్టారర్ చేయాలని చాలా మంది హీరోలకు ఒక కోరిక ఉంది. మంచి కథ దొరికితే ఏ మాత్రం సందేహించకుండా చేయాలని అనుకుంటున్నారు. ఇదివరకే వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి మల్టీస్టారర్ సినిమాల రేంజ్ ని పెంచిన విషయం తెలిసిందే.

 మెగా ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

మెగా ప్రొడ్యూసర్ భారీ ప్లాన్

ఇక త్వరలోనే మహేష్ మరో మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వస్తోంది. మహేష్ బాబూతో గీత ఆర్ట్స్ లో ఎలాగైనా ఒక సినిమాను నిర్మించాలని అల్లు అరవింద్ ఎప్పటి నుంచో ఒక ప్లాన్ వేసుకుంటున్నారు. కానీ వర్కౌట్ అవ్వడం లేదు.

జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్

జూనియర్ ఎన్టీఆర్ తో మల్టీస్టారర్

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ దక్కుతోందని మహేష్ బాబుతో మరో హీరోను జత కలిపి బిగ్ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో హీరో ఎవరంటే.. జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది. తారక్ మహేష్ కాంబినేషన్ అంటే అంచనాలు ఊహలకు అందవని చెప్పవచ్చు.

ఆ సినిమాల తరువాత..

ఆ సినిమాల తరువాత..

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలిసి RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయనున్నాడు. ఇక ఆ తరువాత అల్లు అరవింద్ ఎన్టీఆర్ డేట్స్ తీసుకోవాలని అనుకుంటున్నారట.

Recommended Video

Celebrities Green India Challenge
కరోనా గోల ముగిసిన తరువాత

కరోనా గోల ముగిసిన తరువాత

గీత ఆర్ట్స్ మెయిన్ బ్యానర్ లో ఇతర హీరోలు నటించారా? అనే విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అందుకే GA2 అని మరో ప్రొడక్షన్ ని స్థాపించి ఇతర హీరోలతో చిన్న సినిమాలు చేస్తున్నారు అరవింద్. ఇక ఇప్పుడు మహేష్, ఎన్టీఆర్ లతో అలా మల్టీస్టారర్ ప్రాజెక్టును పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కొన్ని కథలపై చర్చలు జరుపుతున్న అరవింద్ కరోనా గోల ముగిసిన తరువాత ఈ కాంబినేషన్ పై పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X