మెగా ప్రొడ్యూసర్ వెయ్యి కోట్ల రామాయణ ప్రాజెక్ట్.. రంగంలోకి మాటల మాంత్రికుడు

రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాలు మరిన్ని రాబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే వస్తోంది. హిస్టారికల్ కథలపై ఈ మధ్య సీనియర్ నిర్మాతలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇక త్వరలో రామాయణ, మహాభారతం కథలు కూడా బిగ్ స్క్రీన్ పై భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మొదటిసారి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టులో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Ram Pothineni Don't Want 'A Aa' Kind Of Movie From Trivikram
వారి కంటే ముందే ఎనౌన్స్ చేసిన అల్లు అరవింద్

వారి కంటే ముందే ఎనౌన్స్ చేసిన అల్లు అరవింద్

రామాయణం కథ ఆధారంగా సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రణాళికలు రచిస్తుండగా దర్శకుడు ఓం రావత్ ప్రభాస్ తో ఆది పురుష్ కథను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి రామాయణం బ్యాక్ డ్రాప్ లో సినిమాను నిర్మించనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 వెయ్యి కోట్లతో న్యూ రామాయణ

వెయ్యి కోట్లతో న్యూ రామాయణ

ఇక ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఆ మధ్య అనుకోకుండా బ్రేక్ పడింది. ఇటీవల కరోనా తగ్గుముఖం పెట్టడంతో మళ్ళీ యూనిట్ సభ్యులు మధ్యలో రెగ్యులర్ గా చర్చలు మొదలైనట్లు సమాచారం. దాదాపు రూ.1000కోట్లతో సినిమాను అత్యంత భారీగా రూపొందించాలని డిసైడ్ అయ్యరు. సినిమాను రెండు భాగాలుగా నిర్మించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

రంగంలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్..

రంగంలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్..

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమైనది కావున నిర్మాత అల్లు అరవింద్ ఆ బాధ్యతను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమాకు డైలాగ్స్ తో పాటు ఆడిషినల్ స్క్రీన్ ప్లే కూడా అంధించబోతున్నట్లు సమాచారం. పూర్తి కథ రెడీ అయ్యే వరకు చర్చల్లో పాల్గొనాలని అల్లు అరవింద్ సూచించినట్లు సమాచారం.

వచ్చే ఏడాదిలోనే ఆ బడా ప్రాజెక్ట్

వచ్చే ఏడాదిలోనే ఆ బడా ప్రాజెక్ట్

నెక్స్ట్ త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు షూటింగ్ పనులు వచ్చే ఏడాది జనవరి అనంతరం మొదలు కానున్నాయి. ఇక మధ్యమధ్యలో త్రివిక్రమ్ రామాయణ ప్రాజెక్ట్ చర్చల్లో కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. ఇక రామాయణం ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X