అల్లు అర్జున్ పెళ్ళికి తొందరెందుకు?
అల్లు అర్జున్ కి త్వరలోనే పెళ్ళి చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అయితే బన్నీ మరికొంత సమయం ఆగుదామని చెప్తున్నాడుట. అంతేగాక రామ్ చరణ్ వివాహం అనంతరం ఈ ప్రపోజల్ పెట్టమని ఖచ్చితంగా చెప్తున్నాడు. అయితే హీరోలకు పెళ్లి అయినా మార్కెట్ తగ్గుతుందని భయపడాల్సందేమీ లేదని అప్పట్లో చిరంజీవి కి వివాహం అయ్యాకే తారాజువ్వలా దూసుకుపోయిన విషయాన్ని ప్రస్ధావించారని తెలుస్తోది. అలాగే మహేష్ సైతం వివహం చేసుకున్న విషయాన్ని గుర్తు చేసారుట.అయితే ఇంత అర్జంటుగా అతని వివాహానికి మాత్రం కారణం తెలియరాలేదు. ఎందుకంటే ఎంతో ఆలోచించి ఒ నిర్ణయం తీసుకునే అల్లు అరవింద్ ఈ వివాహ ప్రయత్నం వెనకు కూడా ఏదో రీజన్ ఉండేదని అంటున్నారు. ఏదైమైనా త్వరలో ఈ శుభవార్త వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్..గుణశేఖర్ దర్శకత్వంలో వరుడు అనే చిత్రంలో చేస్తున్నారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో ఆర్య-2లోనూ, క్రిష్ దర్శకత్వంలో వేదం లోనూ కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











