తండేల్ హిట్ తర్వాత టాప్ డైరెక్టర్‌తో నాగచైతన్య.. మాస్ యాక్షన్‌తో థియేటర్లు దద్దరిల్లేలా!
చాలా రోజుల తర్వాత అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. 'తండేల్' సినిమాతో ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్నాడు. మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. కేవలం రెండు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరి 100 కోట్ల మార్క్ దాటే ప్రయత్నం చేస్తుంది. ఈ సక్సెస్ తర్వాత మరో మాస్ యాక్షన్ మూవీతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. చైతూ తన నెక్స్ట్ మూవీ విషయంపై తాజాగా ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ అప్డేట్ ఏంటంటే?
అక్కినేని నాగచైతన్య 'తండేల్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ మూవీ విజయం చైతూని వరుస ఫ్లాపుల నుంచి గట్టెక్కించింది. 'తండేల్' (Thandel) మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న హీరో నాగచైతన్య తర్వాత విరూపాక్ష డైరెక్టర్ తో ఒక మైథాలజికల్ థ్రిల్లర్ మూవీని చేయబోతున్న సంగతి తెలిసిందే. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా, నాగచైతన్య మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ క్రేజీ వార్త బయటకు వచ్చింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పుకారు తెగ వైరల్ అవుతుంది. గీతా ఆర్ట్స్ లోనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో చైతూను ఇప్పటి వరకు చూడని మాస్ యాంగిల్‌లో, యాక్షన్ బేస్ మూవీగా ఉండబోతుందట. ఈ మాస్ యాక్షన్ సినిమాకు డైరెక్టర్ ఎవరో కాదు.. బోయపాటి శ్రీను. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. . కథలో మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతో పాటు.. తన హీరో లేదా విలన్ కు అంతకుముందు ఎవరు చూడని భిన్నమైన మేకోవర్ ఇచ్చి, మరింత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు బోయపాటి.
ఆయన "భద్ర" సినిమా నుంచి ఆఖండ సినిమా వరకూ ప్రతి సినిమాలో హీరోకు, అటు విలన్ కు ప్రత్యేక ఆహార్యాన్ని క్రియేట్ చేశారు. అలాంటి డైరెక్టర్ చేతులో చైతూ లాంటి హీరో పడితే.. సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు నాగచైతన్య హిట్లు కొట్టింది లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ తోనే. తాజాగా తండేల్ సినిమాలో చైతూ తన మాస్ లూక్ తో నటించి, మెప్పించారు. బోయపాటి చైతూ కాంబో మూవీ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉందనీ, వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి థియేటర్లు దద్దరిలాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో డైరెక్టర్ బోయపాటి 'అఖండ' సీక్వెల్ 'అఖండ 2 : తాండవం' చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కోసం బాలయ్య ప్యాన్స్ చాలా ఇగర్ గా వేయిట్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు సీన్స్ ను కుంభమేళాలో షూట్ చేశారు. ఈ సినిమాలో బాలయ్యకి విలన్ గా ప్రముఖ తమిళ హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బోయపాటి తెరకెక్కించిన 'సరైనోడు' మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పూర్తి అయిన తరువాత నాగ చైతన్య- బోయపాటి కాంబో తెరకెక్కే అవకాశముంది. అప్పటి వరకు వేచిచూడాల్సిందే..


Click it and Unblock the Notifications











