పవన్ కోసం...పూరి-అరవింద్ ఫైట్?
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ సినిమా అలా ప్రకటించమే ఆలస్యం తమ 'గీతా ఆర్ట్స్' బ్యానర్లోనే ఈ సినిమా చేయలంటూ అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా పూరి జగన్నాథ్‌ను రిక్వెటస్ట్ చేశాడు కూడా. అయితే ఇది అల్లు శిరీష్ అల్లా టప్పాగా అన్న మాట కాదని....శిరీష్ ప్రకటన వెనక అల్లు అరవింద్ ఉన్నాడని, భారీ లాభాలు తెచ్చిపెట్టే ఈ కాంబో సినిమాను దక్కించుకునేందుకు అల్లు అరవింద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
అయితే పూరి జగన్నాథ్ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఈ సినిమాను తన సొంత బ్యానర్ 'వైష్ణో అకాడమి' పై నిర్మించాలని పూరి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ పంజా సినిమా ప్లాప్ టాక్ లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో పూరి-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే ఇక వసూళ్ల వరద పారడం ఖాయం. అందుకే పవన్ సినిమా కోసం ఇటు పూరి జగన్నాథ్-అటు అల్లు అరవింద్ మధ్య అంతర్గత ఫైట్ మొదలైందని గుసగుసలాడుకుంటున్నారు.
ఒక వేళ పవన్ కళ్యాణ్ బంధు ప్రీతికి పోయి గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే సినిమా చేయాలని పట్టుబడితే చెప్పలేం కానీ....దర్శకుడు పూరి జగన్నాథ్ చేతుల్లోనే సినిమా ఉంది కాబట్టి అల్లు అరవింద్ ఆశ నెరవేరడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











