అల్లు అరవింద్ లాజిక్‌‌కు దిల్ రాజు మైండ్ బ్లాక్.. బన్నీతో సంప్రదింపులకు రెడీ

సంక్రాంతి సీజన్ అనేది తెలుగు చిత్ర సీమకు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఏ రేంజ్‌లో జరుగుతాయో.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కూడా అదే రేంజ్‌లో కురుస్తుంది. ఇంతటి మంచి అవకాశాన్ని పెద్ద హీరోలు ఊరికే వదలరు. అందుకు దాదాపు ఏడాది, ఆర్నెళ్ల ముందే సంక్రాంతికి సీట్ బుక్ చేసుకుంటారు. ఇక రెండు మూడు పెద్ద సినిమాలు వస్తాయని తెలిశాక..మిగతా వారెవరూ ఆ దరిదాపుల్లోకి కూడా రారు.

గతేడాది రామ్ చరణ్, బాలయ్య

గతేడాది రామ్ చరణ్, బాలయ్య

గతేడాది సంక్రాంతికి రామ్ చరణ్ వినయ విధేయ రామ, నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో పోటీ పడ్డారు. అయితే విచిత్రమేంటంటే.. ఆ రెండూ కూడా బొక్క బోర్లా పడ్డాయి. వీటిని ఢీకొట్టి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఎఫ్2 భారీ హిట్టు కొట్టి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అలా గత సంక్రాంతికి ఎఫ్2 విన్నర్‌గా నిలిచింది.

ఈ ఏడాది బన్నీ, మహేష్

ఈ ఏడాది బన్నీ, మహేష్

ఈ ఏడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. మొదటగా జనవరి 11న సరిలేరు, జనవరి 12 అల వైకుంఠపురములో వచ్చేందుకు ఫిక్స్ అయినా.. ఆపై సమీకరణాలు మారాయి. అల వైకుంఠపురములో కాస్త ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట్నుంచీ పోటీ..

మొదట్నుంచీ పోటీ..

సరిలేరు టీమ్‌కు, అల వైకుంఠపురములో టీమ్‌కు మొదట్నుంచీ ఏదో ఒక విషయంలో పోటీ వస్తూనే ఉంది. ఒకరు టీజర్ రిలీజ్ చేస్తే.. మరొకరు పాటలు రిలీజ్ చేయడం. మరోసారి పోస్టర్లతో హంగామా చేయడం.. అప్‌డేట్స్ కూడా ఒకే సమయానికి ఇవ్వడం ఇలా ప్రతీ ఒక్క విషయంలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇలా చివరకు రిలీజ్ డేట్ విషయంలోనూ ఎవ్వరూ తగ్గడం లేదు.

అల్లు అరవింద్ లాజిక్..

అల్లు అరవింద్ లాజిక్..

ఈ రెండు పెద్ద చిత్రాల నిర్మాతలైన దిల్ రాజు, అల్లు అరవింద్‌లు మిగతా నిర్మాతలు కూర్చుని మాట్లాడుకున్నారని సమాచారం. ఈ చర్చల్లో అల్లు అరవింద్ వేసిన ఓ ప్రశ్నకు దిల్ రాజు మైండ్ బ్లాక్ అయినట్టు తెలుస్తోంది. ఒకే రోజు వచ్చినా, మర్నాడు వచ్చినా తమ సినిమాకు ఒకే విధంగా థియేటర్లు వస్తుంటే, మర్నాడు ఎందుకు రావాలి అనేదిఅల్లు అరవింద్ క్వశ్చన్. వస్తే మీరు కూడా అదే తేదీకి రండని మొహం మీదే చెప్పాడని టాక్. కానీ దీని వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడతారని, తాను ఓసారి బన్నీతో మాట్లాడతానని దిల్ రాజు సమావేశానికి ముగింపు పలికినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X