అల్లు అరవింద్, సురేష్ బాబు ఆ విషయంలో ఒక్కటయ్యారు
ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు తాజాగా ఒక్కటై పాతాళభైవరి రీమేక్ చేయాలని సంకల్పిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ అప్పట్లో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేసిన తోట రాముడు పాత్రకు రాణా ని ఎంపిక చేసి ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ చేయలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడుగా రాజమౌళిని అడిగే అవకాశముంది. దాదాపు ఎనభై కోట్ల వరకూ బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకోసం మరో ఇద్దరు నిర్మాతలను సేకరించే పనిలో ఉన్నారు. ఇక సురేష్ బాబు తన వంతు పెట్టుబడిగా హీరో రాణాని, స్టూడియో, సాంకేతిక వనరులు సమకూరుస్తానని ప్రపోజల్ పెట్టినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. తను సినిమా తీస్తున్నట్లు ఉండాలి..కానీ రూపాయి ఖర్చు కాకూడదనే స్టాటజీనీ మళ్లీ ఇక్కడ సురేష్ బాబు అమలు పరుస్తున్నారు. ఆయన వెనక నల్లమలుపు బుజ్జి, ఎమ్.ఎస్.రాజు వంటి నిర్మాతలు ఉన్న విషయం తెలిసిందే. అదే రామానాయుడు అయితే పూర్తి స్ధాయిలో పెట్టుబడి పెట్టి సినిమాని ప్రేమించి సక్సెస్ చేసుకునేవాడని, సురేష్ బాబు కాబట్టే ఇలా నిర్మాతల వేటలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రం పూర్తి వివరాలు పూర్తి స్ధాయి ప్రకటన త్వరలో రానుంది. అయితే ఈ పాతాళ భైరవి పై జూ.ఎన్టీఆర్ కు కన్ను ఉంది.


Click it and Unblock the Notifications











