'రక్త చరిత్ర' లో గుండు సీన్ తీసేయమంటూ అల్లు అరవింద్!?
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న'రక్త చరిత్ర' చిత్రంలో గుండు సీన్ గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పరిటాల రవి బ్రతికున్న రోజుల్లో ఓ పాపులర్ సినీ హీరోకి గుండు చేయించారనే వార్తలు అంతటా వచ్చి..ఓ న్యూస్ పేపర్ ఆఫీస్ వద్ద గొడవలు చెలరేగాయి. ఇన్నాళ్ళకు మళ్ళీ రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రంలోని ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి ఆ సంఘటనను గుర్తు చేసారు. పరిటాల రవి పాత్ర ధారి వివేక్ ఒబరాయ్...గుమ్మం దగ్గర నిలబడి సిగెరెట్ కాలుస్తూండగా..ఓ వ్యక్తికి బలవంతంగా గుండు గీయిస్తూంటారు. ఆ గుండు గీయించే సీన్ అప్పట్లో చోటు చేసుకున్న సంఘటనను గుర్తు చేసేదేనని వివాదం మొదలైంది. దాంతో అల్లు అరవింద్ స్పందించి రక్త చరిత్ర నిర్మాత మధు మంతెన(రామ్ గోపాల్ వర్మ బావ) ని సంప్రదించనున్నారని ఫిల్మ్ సర్కిల్సో లో వినపడుతోంది. మధుతో డిస్కషన్ అనంతరం రామ్ గోపాల్ వర్మ ఎడిటింగ్ లో ఆసీన్ ఉంచుతారా లేదా అన్నది తేలుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











