అల్లు అరవింద్ మెగా స్కెచ్.. నాగబాబు తనయుడితో ప్లాన్!

విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ సూపర్ సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ హీరోగా, నాగబాబు తనయుడిగా తెలుగు తెరకు పరిచయమైన ఈ యువ హీరో 'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఆ తర్వాత ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలో మీడియం రేంజ్ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు వరుణ్.

మరికొద్ది రోజుల్లో ఈయన అల్లు బాబీ సమర్పణలో రూపొందనున్న కొత్త సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా ఇరగదీయనున్నాడు. జనవరి నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, ఇందులో వరుణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది.

 Allu Aravindh Plans To Produce Varun Tejs New Project?

ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ వక్కంతం వంశీ.. వరుణ్ తేజ్‌కి ఓ స్టోరీ లైన్ వినిపించారట. ఈ లైన్ నచ్చడంతో వెంటనే మిగితా స్టోరీ డెవెలప్ చేయాల్సిందిగా వరుణ్ పేర్కొన్నాడని తెలుస్తోంది. దీంతో వక్కంతం వంశీ ఆ పనిలో పడ్డారట. ఇక ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.

గతంలో అల్లు అర్జున్‌తో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమా రూపొందించాడు వక్కంతం వంశీ. ఈ సినిమా డిసాస్టర్ కావడంతో మళ్ళీ అదే మెగా హీరోతో సినిమా చేసి విజయం సాధించాలని ప్లాన్ చేశారట వక్కంతం వంశీ. అందుకే ఈ సారి అల్లు అరవింద్ సహకారంతో వరుణ్ హీరోగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X