Allu Arha: స్టార్ హీరో మూవీలో అల్లు అర్హ.. ఊహించని పాత్రలో.. ఈ దెబ్బతో పాన్ ఇండియా రేంజ్‌కు!
టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్లు తమ వారసులను సినీ రంగానికి పరిచయం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో తరం వంతు వచ్చేసింది. ఇప్పుడు బడా హీరోలుగా వెలుగొందుతోన్న కొందరు స్టార్లు తమ పిల్లలను కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్నారు. అలా తెరపై అలరించబోతున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ కూడా ఉంది. ఇప్పటికే సమంత సినిమాలో నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు మరో క్రేజీ మూవీలో భాగం అయిందని తెలిసింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

బన్నీ కూతురు.. ఫుల్ ఫేమస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పేరుతోనే ఫేమస్ అయింది. ఆ తర్వాత ఎదుగుతోన్న క్రమంలోనే ఈ చిన్నారి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలకు.. పాటలకు.. అల్లరికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. అందుకే సోషల్ మీడియాలో అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు భారీ స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి.

బన్నీ సినిమాతో తెరంగేట్రం
క్యూట్‌నెస్‌తో చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిపోయిన బన్నీ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు, అల్లు అర్జున్ సినిమాతోనే ఈ చిన్నారి తెరంగేట్రం చేయబోతుందని కూడా ప్రచారాలు జరిగాయి. దీంతో ఆమె రాకను ఐకాన్ స్టార్ అభిమానులు కోరుకున్నారు.

సమంత సినిమాతో ఎంటర్
సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సీనియర్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారానే అల్లు అర్హ బాలనటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక, ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

మరో క్రేజీ మూవీలోనూ అర్హ
ఇప్పటికే సమంత రూత్ ప్రభు 'శాకుంతలం' మూవీలో నటించిన అల్లు అర్హ.. ఇప్పుడు మరో భారీ చిత్రంలోనూ భాగం అయినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఆమె నటించబోతుందట. దీంతో ఇప్పుడీ న్యూస్ సెన్సేషన్‌గా మారిపోయింది.

అలాంటి పాత్రను చేస్తోంది
సుదీర్ఘ విరామం తర్వత సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివామస్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్హ ఓ స్పెషల్ రోల్ చేస్తుందని తెలిసింది. ఇందులో ఈ చిన్నారి కనిపించేది తక్కువ సేపే అయినా ఎంతో క్యూట్‌గా ఉంటుందట. ఇక, ఈ మూవీలో అర్హ 'సన్నాఫ్ సత్యమూర్తి'లో ఓ చిన్నారి చేసిన రోల్ లాంటిదే చేస్తోందని టాక్.

ఈ షెడ్యూల్‌లోనే జాయిన్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జనవరి 17వ తేదీ నుంచి షురూ చేయబోతున్నారని ఇటీవలే ఓ న్యూస్ లీకైంది. ఇందులో మహేశ్ బాబుతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొనబోతుందని తెలిసింది. ఈ షెడ్యూల్‌లోనే అల్లు అర్హ కూడా భాగం కాబోతుందని సమాచారం. దాదాపు పది రోజుల పాటు ఆమె షూట్‌లో పాల్గనబోతుందట.

పాన్ ఇండియా రేంజ్‌కే
మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును మార్చుతున్నట్లు తెలుస్తోంది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించేందుకే గురూజీ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అదే నిజం అయితే అర్హ రేంజ్ కూడా పాన్ ఇండియా స్థాయికి చేరుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ న్యూస్ బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేస్తోంది.


Click it and Unblock the Notifications











