బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AA20 టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సినీ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇద్దరికీ ఆర్య సినిమాతోనే ప్రయాణం మలుపు తిరిగింది. వారిద్దరి కెరీర్‌లో ఆర్య చిత్రం మరుపురానిది. ఇప్పటికీ ఆర్య ఓ క్లాసిక్‌గానే చెప్పుకుంటారు. ఆపై ఆర్యకు సీక్వెల్ అంటూ ఆర్య 2 వచ్చినా ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే ముచ్చటగా మూడో సారి వీరిద్దరు మరో ప్రాజెక్ట్ కోసం ఏకమయ్యారు.

Recommended Video

Allu Arjun AA20 Title Fix!
ఇద్దరూ మంచి ఊపుమీదున్నారు..

ఇద్దరూ మంచి ఊపుమీదున్నారు..

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మరో చిత్రాన్ని తెరకెక్కించలేదు సుకుమార్. తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు అల్లు అర్జున్. అలాంటి వీరిద్దరు ఓ ప్రాజెక్ట్ కోసం సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అనేక రకమైన పుకార్లు వచ్చాయి.

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్..

ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్..

అల్లు అర్జున్‌తో సంబంధం లేని సీన్స్‌ను ఫస్ట్ షెడ్యూల్‌లో పూర్తి చేసేసింది చిత్రయూనిట్. కేరళ అడవుల్లో జరిగిన ఈ షూటింగ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇక రెండో షెడ్యూల్‌లో బన్నీతో షూట్ చేద్దామంటే కరోనా అడ్డుతగిలింది.

 షూటింగ్ వాయిదా..

షూటింగ్ వాయిదా..

అప్పుడప్పుడే కేరళలో కరోనా విజృంభిస్తుండటంతో చిత్రయూనిట్‌కు ప్రభుత్వం అనుమతినివ్వలేదు. దీంతో షెడ్యూల్ వాయిదా పడింది. అయితే బన్నీ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు మాత్రం లోలోపల రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ బయటకు వచ్చేసింది.

రెండక్షరాల టైటిల్..

రెండక్షరాల టైటిల్..

మొదట్లో ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ రూమర్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి రెండ‌క్ష‌రాల టైటిల్‌ను ఖ‌రారైందట. ఓ అమ్మాయి పేరుని ప్రతిబింబించేలా ఆ టైటిల్ ఉంటుంద‌ని టాక్‌. టైటిల్ లోగో కూడా సిద్ధ‌మైపోయింది. ఈనెల 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రాబోతోన్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X