Allu Arjun Vs Mahesh Babu: AMBకి బలమైన పోటీగా AAA.. అన్ని ఈవెంట్లు ఇక్కడే!
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య... బిజినెస్ రంగంపై దృష్టి పెట్టాడు. మొన్నటికి మొన్న ఆహా ప్రమోషనల్ వీడియో చేసి.. ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత AAA సినిమాస్ అంటూ ఓ మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించాడు. ఈ థియేటర్ గత వారం ఆదిపురుష్ ప్రదర్శనతో ప్రారంభమయింది. అయితే ఈ మల్టీ ప్లేక్స్ ఇప్పుడు అన్ని వేడుకలకు వేదిక అవుతుంది. మహేశ్ స్థాపించిన ఏఎంబీ సినిమాస్ కు పోటీగా తయారైంది. ఆ వివరాల్లోకి వెళితే....
అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్.. ఆదిపురుష్ సినిమా ప్రదర్శనతో ప్రారంభం అయింది. ఏషియన్ సినిమాస్ తో కలసి అల్లు అర్జున్ ఈ మల్టీఫ్లెక్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. జూన్ 14న పూజా కార్యక్రమాల అనంతరం ఈ మల్టీప్లెక్స్ ఘనంగా ప్రారంభించారు. అయితే ఈ థియేటర్లపై సామాన్యులే కాదు... సెలబ్రేటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. దాని ప్రొజెక్షన్ ఆప్షన్స్, సాంకేతిక నైపుణ్యం గురించి మాట్లాడుకుంటున్నారు.

ఇక AAA సినిమాస్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల కోసం లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అల్లు అర్జున్అవార్డులు, జ్ఞాపికలను ప్రదర్శనకు కూడా ఉంచారు. అక్కడికి వెళ్లిన సామాన్యులు సైతం సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. ఇక ఈ సౌకర్యాలతో పాటు AAA సినిమాస్ సినీ పరిశ్రమలోని కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.
మొన్న నిఖిల్ స్పై ట్రైలర్ లాంచ్ కార్యక్రమం AAA సినిమాస్ లో ఘనంగా జరిగింది. ఈ అల్లు అర్జున్ AAA సినిమాస్ లో జరగిన తొలి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ అదే. తాజాగా ఈరోజు నాగశౌర్య రంగబలి ట్రైలర్ ఈవెంటును ఇక్కడే జరిపారు. ఒకప్పుడు ప్రమోషనల్ ఈవెంట్లు అనగానే ప్రసాద్ ఐమాక్స్, ప్రసాద్ లాబ్స్, కొత్తగా AMB సినిమాస్ మాత్రమే అప్షన్ గా ఉండేవి. ఇక ఇప్పుడు ఈ కొత్త AAA సినిమాస్ అందుబాటులోకి రావడంతో ఇది కొత్త ఆప్షన్ గా మారింది.
ఇక అల్లు అర్జున్ AAA సినిమాస్‌లో మొత్తం 5 స్క్రీన్‌లు ఉన్నాయి. స్క్రీన్ 167 అడుగుల ఎత్తుతో ATMOS సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ 2 ATMOS సౌండ్‌తో కూడిన EPIQ లక్సన్ స్క్రీన్ కాగ మిగిలిన మూడు స్క్రీన్‌లు 4K ప్రొజెక్షన్‌ను కలిగి ఉంటాయి. ఇక ఈ స్క్రీన్‌లు అన్ని డాల్బీ 7.1 సౌండ్‌తో ఫిక్స్ చేశారు. అటు ఆర్కిటెక్చర్ పరంగానూ, ఈవెంట్స్ పరంగానూ, ఇటు బుకింగ్స్ పరంగానూ AAA సక్సెస్ ఫుల్ అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











