అల్లు అర్జున్, నాగచైతన్య కాంబినేషన్ లో...
హైదరాబాద్: ఇప్పుడు మల్టి స్టారర్ ఫిల్మ్ లకు డిమాండ్ ఉంది. దాన్ని పురసక్కరించుకుని అల్లు అర్జున్, నాగచైతన్య కాంబినేషన్ లో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది మరేదో కాదు ఆర్య 3. అల్లు అర్జున్ తో, నాగచైతన్యతో ఇప్పటికే సుకుమార్ హిట్స్ ఇచ్చి ఉన్నారు. దాంతో వీరిద్దరూ ఈ కాంబినేషన్ చిత్రకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.
ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన చిత్రం ఆర్య. ఆ తర్వాత ఆర్య వర్కవుట్ కాలేదు. కానీ అల్లు అర్జున్, సుకుమార్ లకు ఈ చిత్రంపై మమకారం తీరినట్లు లేదు. ఆర్య3 కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్ రాజు తమ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మిస్తారని తెలుస్తోంది. అలాగే నాగచైతన్యని ఓ కీలక పాత్రలో తీసుకుంటున్నారని వినపడుతోంది. ఇక సమంతని అల్లు అర్జున్ ప్రక్కన చేయటానికి ఒప్పించారని, ఇప్పటికే స్టోరీలైన్ ఓకే అయ్యిందని, త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. అంతేగాక ఈ చిత్రానికి హరీష్ జై రాజ్ ని సంగీతం అడుగుతున్నట్లు భోగట్టా.
మరో ప్రక్క నాగచైతన్య వరసగా రీమేక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో హిట్టైన వెట్టై ని సునీల్ తో కలిసి చేస్తున్నారు. అలాగే 'హలో బ్రదర్' చిత్రాన్ని మళ్లీ తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నాగార్జున సినీ వారసుడు నాగచైతన్య ఈ చిత్రంలో నటించబోతున్నాడు. తండ్రి లాగే నాగచైతన్య కూడా ఇదే చిత్రం రీమేక్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం.


Click it and Unblock the Notifications











