Allu Arjun: అది బన్నీ కమిట్మెంట్... నష్టం జరుగుంతందని తెలిసినా... దేశం కోసం అలా చేశాడు!

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినా... తనకంటూ ఓ క్రేజ్ ను ఏర్పరచుకుని.. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో బన్నీ.. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ప్లాప్ అయ్యే అవకాశం ఉందని తెలిస్తే.. ఏ హీరో సినిమా ఒప్పుకునేందుకు ముందుకురారు. అయితే బన్నీ మాత్రం.. ఆ సినిమా ప్లాప్ అయితుందని తెలిసినా... దేశం కోసం ఆ సినిమాలో నటించాడట. ఆ వివరాల్లోకి వెళితే...

స్టైలిష్ స్టార్: చిరంజీవి డాడీ సినిమాలో గోపి అనే పాత్రలో బన్నీ నటించాడు. ఆ సినిమాలో కుర్రాడి డ్యాన్స్ కు అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్యతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని... స్టైలిష్ స్టార్ గా మారిపోయాడు బన్నీ.

Allu Arjun acted in the film even though he knew it would be a flop

పుష్పతో ఐకానిక్ స్టార్: ఇక గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పు సినిమాతో ఐకానిక్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. ఇక ఈసినిమా ఒక్క ఇండియాలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కు మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో పార్టులో నటిస్తున్నాడు బన్నీ.

Allu Arjun acted in the film even though he knew it would be a flop

బన్నీ సాహసం: అయితే ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా బన్నీ ఆ సినిమా చేశాడట. ఏ హీరో అయినా సినిమా ప్లాప్ అయ్యే ఛాన్స్ ఉంటే.. ఎవరూ ముందుకు రారు. కానీ బన్నీ మాత్రం... పెద్ద సాహసమే చేశాడని చెప్పాలి. ఆ సినిమా ఏంటో కాదు.. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ సినిమా వక్కంత వంశీ దర్శకత్వంలో 2018లో వచ్చింది. అయితే బన్నీ కెరియర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పరాజయం పాలైంది.

Allu Arjun acted in the film even though he knew it would be a flop

దేశంకోసం: ప్రసెంట్ జనరేషన్ అంత రొమాంటిక్, సస్పెన్స్, హార్రర్ సినిమాలు చేస్తున్నారు.. ఈ దేశ భక్తి మూవీని చూస్తారా అని బన్నీకి ముందుగానే ఆలోచన వచ్చిందట. ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని భావించారని సమాచారం. కానీ తన కెరియర్లో ఒక్కటైన దేశ భక్తి ఫిల్మ్ చేశాననే తృప్తి ఉండాలని ఈ సినిమా చేశారట. అను ఇమ్మన్యూయేల్ హీరోయిన్ గా నటించగా.. అర్జున్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అయినప్పిటకీ ఈ సినిమా బన్నీ అనుకున్నట్లే.. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X