‘S/O సత్యమూర్తి’ ముద్దు సీన్ కట్ చేసారా?
హైదరాబాద్: అల్లు అర్జున్....ఇప్పటికే వరుడు, ఆర్య 2 లాంటి చిత్రాల్లో లిప్ లాక్ సీన్లు అదరగొట్టాడు. త్వరలో విడుదల కాబోతున్న ‘S/O సత్యమూర్తి' చిత్రంలో కూడా అదా శర్మ పెదాలను జుర్రేసాడట. అయితే ఫైనల్ ఎడిటింగులో ఈ సీన్ తీసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇద్దరి మధ్య ఓ ఎమోషన్ సీన్లో ఈ ముద్దు సీన్ చేయించారట. అయితే ఫ్యామిలీ ఎంటర్టెన్మెంటులో ఈ సీన్ అవసరం లేదని డిసైడ్ అయిన దర్శకుడు త్రివిక్రమ్ ముద్దు సీన్ డిలీట్ చేయించాడట. సినిమాను క్లీన్ గా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

s/o సత్యమూర్తి' ఏప్రిల్ 9న అత్యధిక ధియోటర్స్ లొ విడుదలవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o సత్యమూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటిస్తున్నారు. ఇటీవలే మ్యూజిక్ డెవిల్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందించిన ఆడియో సూపర్‌హిట్ అయ్యింది. ఈ సక్సస్ ని అభిమానులందరితో పంచుకోవటానికి ఏప్రిల్ 6న విజయవాడలో 's/o సత్యమూర్తి' యూనిట్ అందరూ హజరయ్యి గ్రాండ్ గా ఆడియో సక్సస్‌మీట్‌ని నిర్వహిస్తున్నారు.
నటీనటులు అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్, అదాశర్మ, ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్,స్నేహ, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్,ఎం.ఎస్.నారాయణ తదితరులు. సాంకేతిక వర్గం పి.ఆర్.వో- ఎస్.కె.ఎన్, ఏలూరుశ్రీను, ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.


Click it and Unblock the Notifications











