అల్లు అర్జున్ పై బాలీవుడ్ డైరెక్టర్ కన్ను.. అలా జరిగితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలే

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సిరీస్‌తో ఆయన పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. ముఖ్యంగా పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ ఏకంగా గ్లోబల్ లెవెల్‌కు చేరింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబోలో మూవీ రానున్నది. ఇలా కెరీర్ పీక్ ఫేజ్‌లో కొనసాగుతుండగా, తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చిన ఓ క్రేజీ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఎంటీ? ఇంతకీ ఆ స్టార్ డెరెక్టర్ ఎవరు?

ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు. బాలీవుడ్‌లో ఉరి, ధురంధర్ వంటి బ్లాక్‌బస్టర్లతో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్. 2019లో ఉరి (The Surgical Strike) తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఆదిత్య ధర్, తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆరేళ్ల గ్యాప్ తీసుకుని ఇటీవల విడుదలైన ధురంధర్ తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించారు. ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పై ఈ సినిమా వసూలు చేసింది. ఇప్పటికే 'ధురంధర్ 2' ప్లానింగ్‌లో ఉన్న ఆదిత్య ధర్, దాని తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నారని టాక్.

Allu Arjun Aditya Dhar Durandhar Director s Dream Project with Icon Star Creates Huge Buzz

ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే ఆలోచన బలపడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా జరిగిందని, బన్నీ నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం. వాస్తవానికి ఆదిత్య ధర్ ఎప్పటి నుంచో అశ్వత్థామ పాత్ర చుట్టూ ఓ భారీ మైథాలజికల్-యాక్షన్ డ్రామాను తెరకెక్కించాలని అనుకున్నారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ను విక్కీ కౌశల్‌తో చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అదే సమయంలో కల్కి 2898 AD ప్రాజెక్ట్ అనౌన్స్ కావడం, అందులో అశ్వత్థామ పాత్ర కీలకంగా ఉండటంతో... ఆ కథను పక్కన పెట్టారని సమాచారం.

'కల్కి'లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అదరగొట్టడంతో, మళ్లీ అదే కాన్సెప్ట్‌తో సినిమా చేయడం సరికాదని ఆదిత్య ధర్, అల్లు అర్జున్ కలిసి ఆ ఆలోచనను విరమించుకున్నారని టాక్.ఇప్పుడు వినిపిస్తున్న తాజా వార్త ఏంటంటే.. ఇది పూర్తిగా కొత్త కథ. మైథాలజీ కాకుండా, పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్ నిజమైతే... అది కేవలం పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ స్థాయి ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప ఫ్రాంచైజీతో రెండు వెయ్యి కోట్ల క్లబ్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం AA22, AA23గా రెండు భారీ ప్రాజెక్టులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. వీటితో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో కూడా బన్నీ సినిమా చర్చల దశలో ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిత్య ధర్‌తో సినిమా అంటే.. అది బన్నీ కెరీర్‌లో మూడో 1000 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా మారే అవకాశముందని ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. అయితే.. మూవీపై ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతమైతే ఇవన్నీ పుకార్లే. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇండస్ట్రీ టాక్ ప్రకారం... 'ధురంధర్ 2' థియేటర్లలో విడుదలైన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఒకవైపు టాలీవుడ్ ఐకాన్ స్టార్, మరోవైపు బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్. ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తే అది కచ్చితంగా ఇండియన్ సినిమాకే ఓ కొత్త బెంచ్‌మార్క్ అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఇది గాసిప్‌గానే ఉన్నా... బన్నీ- ఆదిత్య ధర్ కాంబినేషన్ వార్త మాత్రం సినీ అభిమానుల్లో భారీ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే... ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలెక్కుతుందా? లేదా? వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: allu arjun aditya dhar Dhurandhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X