బాలయ్యను ఇన్సల్ట్ చేసారా?
వరద బాధితులను ఆదుకోవటం కోసం ఫండ్స్ రైజ్ చేయటానికి స్టార్ నైట్ ఐడియాతో బాలకృష్ణ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం ఫాలో కావాల్సిన కార్యాచరణ నిమిత్తం జయభేపి ఆఫీసులో మీటింగ్ పెట్టారు. అలాగే అల్లు అర్జున్, రామ్ చరణ్ లను స్వయంగా పిలిచారు. అయితే ఆ మీటింగ్ కు వస్తామని చెప్పిన వాళ్ళు చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చారు. నిజానికి చాలామంది వాళ్ళిద్దరూ అటెండవుతారని ఆశించారు. దాంతో తెలుగు పరిశ్రమలో ఓ వర్గానికి ఇదో హాట్ టాపిక్ గా మారింది.బాలకృష్ణ లాంటి సీనియర్ పిలిచినా రాకపోవటం ఆయన్ని అవమానించి నట్లే అంటున్నారు.
మరో ప్రక్క వారు రాకపోవటం ద్వారా పరిశ్రమలో రెండు వర్గాలు నడుస్తున్నాయనేది బహిరంగంగా చెప్పినట్లయిందంటున్నారు. అందులోనూ ఓ ప్రక్క మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఈ విషయమై మాటల యుధ్దం జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవటం పరిశ్రమకు మంచిది కాదని అంటున్నారు. ఏదైమైనా కొద్దిమంది మాత్రం స్టార్స్ తాము పర్శనల్ గా ఫండ్స్ ఇవ్వకుండా ఇలా స్టార్ నైట్ పెట్టి జనాల దగ్గరనుండే డబ్బులు వసూలు చేసి ఇస్తామనటం ఎంతవరకూ సమంజసం అని అంటున్నారు. ఇదీ ఆలోచించాల్సిందే.


Click it and Unblock the Notifications











