అదిరిపోయే అప్‌డేట్.. పుష్ఫ స్టోరీ లీక్.. తొలి సీన్ నుంచే వారిద్దరు అలా!!
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాష్టారు సుకుమార్ కాంబో అంటే అందరికీ అంచనాలుంటాయి. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇక వరుసగా మూడో సారి హిట్ కొట్టి హ్యాట్రిక్‌ను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, బన్నీ ఫస్ట్ లుక్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ కథ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇద్దరూ ఇండస్ట్రీ హిట్స్ కొట్టినవారే..
రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సుకుమార్.. అల వైకుంఠపురములో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను క్రియేట్ చేసిన అల్లు అర్జున్ కలిసి సినిమా చేస్తుండటంతో అంచనాలు ఆకాశన్నంటాయి. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

ప్యాన్ ఇండియన్ మూవీగా..
ప్యాన్ ఇండియా మూవీలో నటించాలని, బాలీవుడ్‌లో కూడా తన జెండాను పాతాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు అల్లు అర్జున్. ఇన్నాళ్లకు బన్నీ కోరిక తీరబోతోంది. నేషనల్ వైడ్‌గా పుష్ఫ సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు.,

ఆదిలోనే దెబ్బ..
అయితే పుష్ఫ చిత్రానికి కరోనా రూపంలో పెద్ద దెబ్బలే తగులుతున్నాయి. అంతా సవ్యంగా ఉండుంటే.. ఈపాటికి ఓ షెడ్యూల్ పూర్తయ్యేది కూడా. అయితే కరోనా రావడంతో అంతా తారుమారైంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతిని విలన్‌గా తీసుకున్నారట.. కానీ కరోనా రావడంతో డేట్స్ అన్ని మారిపోయాయి. దీంతో మరోసారి డేట్స్ ఇవ్వలేకపోడంతో ఈ సినిమా నుంచి విజయ్ తప్పుకున్నాడట
Recommended Video

ఇద్దరూ భార్యభర్తలుగా..
సుకుమార్ చిత్రంలో లాజిక్స్ ఎన్ని ఉన్నా..ఎమోషన్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఏ సినిమా తీసుకున్నా ఎమోషన్స్‌ను మాత్రం పీక్స్‌లో చూపిస్తాడు. పుష్ఫలోనూ అంతేనట. బన్నీ, రష్మీ మొదటి సీన్ నుంచే భార్య భర్తలుగా కనిపిస్తారని, ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని టాక్ నడుస్తోంది. తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునేందుకు గంధపు చెక్కల స్మగ్లర్‌గా మారుతాడని తెలుస్తోంది. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాలి.


Click it and Unblock the Notifications











