Pushpa Part 3: పుష్ప సిరీస్‌లో మరో మూవీ.. రీసౌండ్ వచ్చేలా 3వ పార్ట్ టైటిల్
తెలుగు సినిమా రేంజ్ గతంలో కంటే ఇప్పుడు భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన హీరోల్లో ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను చేస్తున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. 'పుష్ప' మూవీతో మనోడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ది రైజ్' మొదటి భాగం సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప రాజ్ సాధారణ స్మగ్లర్ నుంచి బడా వ్యాపారిగా మారి ఎలా రూల్ చేశాడన్న అంశంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

సక్సెస్‌ఫుల్ కాంబోలో రాబోతున్న 'పుష్ప ది రూల్' సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుతోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసుకున్నారు. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు.
ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప ది రూల్' మూవీ విడుదల కాకముందే.. దీనికి కొనసాగింపుగా మరో చిత్రాన్ని కూడా వీళ్లు తీయబోతున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది. అంతేకాదు, దీనికి 'పుష్ప ది రోర్' అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ విషయాన్ని 'పుష్ప ది రూల్' ఎండింగ్‌లో రివీల్ చేయబోతున్నారని సమాచారం.

'పుష్ప ది రోర్' మూవీకి సంబంధించిన లైన్‌ను ఇప్పటికే దర్శకుడు సుకుమార్.. అల్లు అర్జున్‌కు చెప్పాడట. ఇది అతడికి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ మూడో పార్టుకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు చేస్తారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మొత్తానికి 'పుష్ప' సిరీస్ కంటిన్యూ అవుతుందన్న వార్త బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఇదిలా ఉండగా.. 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











