ఊహించని ట్విస్ట్.. వరుణ్ తేజ్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్.. ఆ రోజే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే నూతన చిత్రం కోసం అభిమానులంతా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. నా పేరు సూర్య చిత్రం తరువాత బన్నీ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. తన తదుపరి చిత్రం మంచి విజయం సాధించి, అభిమానులకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉండాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. మంచి కథ ఎంపిక చేసుకునే విషయంలో ఆలస్యం జరుగుతోంది. బన్నీతో సినిమా అంటూ పూటకొక దర్శకుడి పేరు తెరమీదికి వస్తోంది. జనవరి 1న బన్నీ తన కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నాడనేది లేటెస్ట్ న్యూస్.

త్రివిక్రమ్‌తో అన్నారు
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఖాయం అయిపోయిందంటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. దీనితో బన్నీ సినిమా విషయంలో సందిగ్దత కొనసాగుతోంది. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ కూడా బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. కానీ అల్లు అర్జున్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో అర్థం కావడం లేదు.

ఊహించని ట్విస్ట్
అల్లు అర్జున్ కొత్త సినిమా నేపథ్యంలో మరో ట్విస్ట్ వచ్చి పడింది. ఘాజి, అంతరిక్షం చిత్రాలతో విభిన్న చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి కూడా బన్నీకి కథ వినిపించాడట. బన్నీ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. సంకల్ప్ రెడ్డి సినిమాల విషయంలో సరికొత్త దారిని ఎంచుకున్నాడు.

బన్నీ చేస్తాడా
సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన అంతరిక్షం చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారు. అల్లు అర్జున్ సినిమా అంటే ఆడియన్ వినోదాన్ని కోరుకుంటారు. ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కిస్తున్న సంకల్ప్ రెడ్డి బన్నీతో సినిమా అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని కథ కనెక్ట్ అయితే మాత్రం అల్లు అర్జున్ ప్రాణం పెట్టి చేస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

జనవరి 1న
న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న అల్లు అర్జున్ తన కొత్త చిత్ర ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టైలిష్ స్టార్ ని డైరెక్ట్ చేయబోయే ఆ దర్శకుడు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే బన్నీ 19వ చిత్రం ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్య మూర్తి లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి.


Click it and Unblock the Notifications











