మరో అగ్ర దర్శకుడితో అల్లు అర్జున్ బడా ప్రాజెక్ట్.. మొదటిసారి అలాంటి ప్రయోగం

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసగా పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పైకి వస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా మిగతా ఇండస్ట్రీలో కంటే తెలుగు చిత్రపరిశ్రమలోనే మన హీరోలు భారీస్థాయిలో నెవర్ బిఫోర్ అనేలా సినిమాలను తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బాహుబలి అనంతరం మేకింగ్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. మన హీరోలు అయితే ఒకసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ మొదలు పెడితే వెళ్తే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అదే దారిలో వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక త్వరలోనే మరో కోలీవుడ్ దర్శకుడితో కూడా అల్లు అర్జున్ ఒక బిగ్ బడ్జెట్ సినిమాతో బిజీ కానున్నట్లు ఒక టాక్ అయితే వస్తోంది.

ఎవరూ ఊహించలేదు..

ఎవరూ ఊహించలేదు..

ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్య సినిమా అనంతరం ఈ కాంబినేషన్ లో ఇలాంటి ఊర మాస్ యాక్షన్ సినిమా వస్తుంది అని ఎవరూ ఊహించలేదు. దర్శకుడు సుకుమార్ కూడా రంగస్థలం అనంతరం తన స్థాయిని మరింత పెంచుకోవాలని మొదటి సారి ఇండియా ప్రాజెక్టును మార్కెట్లోకి తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది.

పుష్ప రిలీజ్ ఎప్పుడంటే..?

పుష్ప రిలీజ్ ఎప్పుడంటే..?

సినిమా మేకింగ్ పై సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటి పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్ సెలవులు కూడా సినిమా కలెక్షన్స్ కు ఎంతగానో హెల్ప్ అవుతాయని మిగతా భాషల్లో కూడా హిట్ అవ్వాలి అంటే అదే సరైన డేట్ అని నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండవ భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో లేదా ఆ తరువాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు.

గ్యాప్ ఇవ్వకూడదు అని..

గ్యాప్ ఇవ్వకూడదు అని..

పుష్ప అనంతరం కూడా అల్లు అర్జున్ మరిన్ని పాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ ప్రాజెక్టును ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. అయితే కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా తో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ మాత్రం పెద్దగా గ్యాప్ ఇవ్వకూడదు అని వరుసగా కథలు కూడా వినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఏఆర్.మురగదాస్ కాంబినేషన్లో..

ఏఆర్.మురగదాస్ కాంబినేషన్లో..

అల్లు అర్జున్ రీసెంట్ గా ఓ కోలీవుడ్ దర్శకుడు చెప్పిన కథకు టెంప్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ దర్శకుడు సినిమాలకు భారీ స్థాయిలో మార్కెట్ ఉంది. గజినీ తుపాకి సినిమాలకు తెలుగులో మంచి కలెక్షన్స్ అందాయి. అయితే చివర తెలుగు హీరోతో చేసిన స్పైడర్ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

Recommended Video

Allu Arjun Changes Hotel Owner's Fate || Filmibeat Telugu
పూర్తిగా సెట్ అయిన తర్వాతనే..

పూర్తిగా సెట్ అయిన తర్వాతనే..

ఈసారి ఈ తమిళ దర్శకుడు మంచి విజయాన్ని అందుకోవాలని ఒక సైన్స్ ఫిక్షన్ కథ తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించే అవకాశం ఉందట. ఇటీవల దర్శకుడు బన్నీ కలిసిన కథ గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ కు ముందు నుంచి మంచి పరిచయం ఉన్న మురుగదాస్ తెలుగులో అల్లు అర్జున్ తో సినిమా చేయాలని చాలాకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఈ కథ పై మరి కొన్ని రోజులు చర్చ జరిగే అవకాశం ఉంది. పూర్తిగా స్క్రిప్ట్ సెట్ అయిన తర్వాతనే ముందు అడుగు వేయాలి అని అనుకుంటున్నారు.మరి ఆ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X