ఇష్టమైన దర్శకుడితోనే మరో ప్రాజెక్ట్ చేయబోతున్న అల్లు అర్జున్.. స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు కొనసాగింపుగా రాబోయే పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా దర్శకుడు సుకుమార్ రెండవ భాగంలో అల్లుఅర్జున్ ని అంతకుమించి అనే తరహాలోనే చూపిస్తాడు అని అర్థమవుతుంది. ఇక ఆ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ పనులు కూడా త్వరలోనే మళ్లీ మొదలు కానున్నాయి. ఇక సుకుమార్ తో పుష్ప రెండవ భాగాన్ని పూర్తి చేసిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో వర్క్ చేస్తాడు అనే విషయంలో అభిమానులు అయితే కొంత కన్ఫ్యూజన్ నెలకొంది.

అసలైతే ఇంతకు ముందు అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాను చేయాలి అనుకున్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ లు మళ్ళీ మధ్యలోనే హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న క్రేజ్ కారణంగా పాన్ ఇండియా సినిమాలు చేయాలని అల్లు అర్జున్ ఆలోచించి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన భవిష్యత్తు సినిమాల పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

Allu arjun another project with trivikram srinivas inside details

అల్లు అర్జున్ 22వ సినిమా సినిమా బోయపాటి దర్శకత్వంలో చేయవచ్చని తెలుస్తోంది. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదలు కావచ్చు అని సమాచారం. ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేని తో ఒక సినిమా చేసేందుకు స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ 23వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదివరకే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూడు సినిమాలు చేసి అల్లు అర్జున్ వరుస బాక్సాఫీస్ విజయాలను సొంతం చేసుకున్నాడు. జులాయి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తో కూడా అల్లు అర్జున్ తన మార్కెట్ను పెంచుకున్నాడు.

ఇక మూడవ సారి చేసిన అల వైకుంఠపురములో.. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక నాలుగవ సారి ఈ కాంబినేషన్ కలిస్తే మరో ఇండస్ట్రీ హిట్ నిలవడం ఖాయం అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు సినిమా అనంతరం అల్లు అర్జున్ తోనే చేయాలని అనుకుంటున్నాడు ఎన్టీఆర్ తో కూడా ఈ దర్శకుడికి కమిట్మెంట్ అయితే ఉంది. కానీ ఇప్పట్లో ఎన్టీఆర్ దొరికేలా లేడు అని ముందుగానే అల్లు అర్జున్ ను లాక్ చేసుకోవాలి అని త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్లు సమాచారం. అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళవచ్చు అని సమాచారం. ఇక ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ తన ఫోకస్ మొత్తం పుష్ప సెకండ్ పార్ట్ పైన పెట్టాడు ఆ సినిమాతో ఎలాగైనా మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలి అని ఇండియన్ మార్కెట్ లోకి కూడా పెంచుకునే విధంగా అడుగులు వేయాలి అని ఆలోచిస్తున్నాడు. మరి పుష్ప సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమాలు ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X