For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెనుకాడట్లేదు: బన్నీ ఎంత రిస్క్ చేస్తున్నాడంటే?.., కొడితే మాత్రం కుంభస్థలమే!

  |
  బన్నీ ఎంత రిస్క్ చేస్తున్నాడో తెలుసా ?

  మూస సినిమాలు చేస్తే.. కలెక్షన్లు వస్తాయోమే గానీ.. ఒక్కసారి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఒక్క మంచి సినిమా ఉండదు. ఈ మాటంటే.. సామాజిక సందేశాలిస్తే ఎవరూ సినిమాలు చూడరిక్కడ.. అన్న సమాధానం వెంటనే వినిపిస్తుంది. కానీ, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారన్న సంగతి విస్మరించరానిది.

  బహుశా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూస నుంచి కాస్త పక్కకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ విపరీతంగా నచ్చడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దర్శకుడిగా అనుభవం లేకపోయినా సరే.. ఆ కథలో ఉన్న కంటెంట్ రీత్యా.. సినిమా చేయడానికి బన్నీ వెనుకాడట్లేదట.

  నా భార్య అడిగితే చెప్పలేకపోయా.., ఇక్కడికి కచ్చితంగా రావడానికి కారణం ఒక్కటే?-అల్లు అర్జున్

  ఎవరా దర్శకుడు:

  ఎవరా దర్శకుడు:

  అను రెడ్డి అనే ఓ యువ దర్శకుడు బన్నీకి కథ వినిపించాడట. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథ కొత్తగా అనిపించడంతో తన ప్రొడక్షన్ లోనే చేస్తే బాగుంటుందని బన్నీ అనుకుంటున్నాడట. అయితే కొత్త దర్శకుడిని నమ్మి సినిమాను చేతిలో పెడుదామా?.. వద్దా?.. అన్న డైలామా మాత్రం వెంటాడుతోందట.

  అందుకే.. టెస్ట్ షూట్:

  అందుకే.. టెస్ట్ షూట్:

  అను రెడ్డి కొత్త దర్శకుడు కావడంతో.. అతన్ని నమ్మి ప్రాజెక్ట్ కమిట్ అవాలా వద్దా అన్నది నిర్ణయించేందుకు బన్నీ ఒక టాస్క్ ఇచ్చారట. అదే టెస్ట్ షూట్. తనకు చెప్పిన కథనే.. ఇతర నటీనటుల ద్వారా టెస్ట్ షూట్ చేసుకోని రమ్మన్నారట. ఆ రషెస్ నచ్చితే సినిమా చేసేందుకు కమిట్ అవుతానని చెప్పారట.

  చెప్పేశారు: బన్నీ 'ఫస్ట్ ఇంపాక్ట్'తో వస్తున్నాడట.. ఏమై ఉంటుంది?

   టెస్ట్ షూట్‌లో బిజీగా:

  టెస్ట్ షూట్‌లో బిజీగా:

  బన్నీ కమిట్ మెంట్ పై సందేహం లేదు.. ఇక నిరూపించుకోవాల్సింది తానే కాబట్టి.. అను రెడ్డి సైతం రంగంలోకి దిగిపోయాడట. స్క్రిప్టు ప్రకారం చాలా జాగ్రత్తగా టెస్ట్ షూట్ చేస్తున్నాడట. త్వరలోనే ఈ సీన్స్ బన్నీకి చూపించి సినిమా ఓకె చేయించుకోగలనన్న నమ్మకంతో ఉన్నాడట.

   ఒకప్పుడు వర్మ..:

  ఒకప్పుడు వర్మ..:

  ఒకప్పుడు రాంగోపాల్ వర్మ నాగార్జునతో 'శివ' సినిమా తీసేందుకు.. టెస్ట్ షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన 'మళ్లీ రావా' సినిమా డైరెక్టర్ కూడా ముందు హీరో సుమంత్ కు టెస్ట్ షూట్ చేసి చూపించాకే.. సినిమా ఓకె చేయించుకున్నాడు. ఇప్పుడు అను రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నాడు.

  కొడితే.. కుంభస్థలమే!:

  కొడితే.. కుంభస్థలమే!:

  ఒక విభిన్న తరహా పాత్రలో కనిపించడం నటుడిగాను, కెరీర్ పరంగాను తనకు ఒక మైలు రాయిలా నిలిచిపోతుందని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టే.. రిస్క్ అనుకోకుండా, కథ మీద నమ్మకంతో కొత్త దర్శకుడి వైపు మొగ్గుచూపుతున్నాడనుకోవచ్చు. ఒక రకంగా రొటీన్ సినిమాలతో హిట్స్ కన్నా.. ఒక డిఫరెంట్ మూవీతో కుంభస్థలాన్నే కొట్టాలని ఆయన భావిస్తున్నారేమో!

  English summary
  Stylish Star Allu Arjun is all set to introduce a new director soon. The actor is planning to float his own production house and start producing movies on his own.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X